అన్వేషించండి

AI అనేది ఓ మ్యాజిక్ టూల్‌, సరైన విధంగా వాడుకోవాలి - బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ

Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ టూల్ సరైన వాళ్ల చేతిలో పడితే మ్యాజిక్ చేయొచ్చంటూ ప్రధాని మోదీ వెల్లడించారు.

PM Modi Bill Gates Interaction: ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌ గేట్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. AI టెక్నాలజీ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకూ పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ AI టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే ఈ సాంకేతికతను చాలా మంది దుర్వినియోగం చేసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీని సరిగ్గా వాడితే అంతకు మిచ్చిన మ్యాజిక్ టూల్‌ ఏమీ ఉండదని అన్నారు. AI తో జనరేట్ చేసిన కంటెంట్‌కి కచ్చితంగా వాటర్‌మార్క్ వేయాలని, తద్వారా డీప్‌ఫేక్ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశముంటుందని సూచించారు. 

"ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి మంచి టెక్నాలజీని సరైన శిక్షణ ఇవ్వకుండానే చేతుల్లో పెడితే కచ్చితంగా దుర్వినియోగం అవుతుంది. AIతో జనరేట్ చేసిన కంటెంట్‌పై కచ్చితంగా వాటర్‌ మార్క్ వేయాలి. అలా అయితేనే దాన్ని మిస్‌యూజ్‌ చేయకుండా అడ్డుకోగలం. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా డీప్‌ఫేక్ టెక్నాలజీని వాడేందుకు వెసులుబాటు ఉంది. అసలు ఈ డీప్‌ఫేక్‌ కంటెంట్‌ని గుర్తించడమే సవాల్‌గా ఉంది. కచ్చితంగా ఈ టెక్నాలజీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి"

- ప్రధాని నరేంద్ర మోదీ 

ఇటీవల కొంత మంది ప్రముఖుల వీడియోలు డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు. ఇవి అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఆ వీడియో ఫేక్ అని గుర్తించడానికి కూడా వీల్లేనంత కచ్చితంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ఈ టెక్నాలజీ గురించి ప్రస్తావించడం కీలకంగా మారింది. ChatGPT లాంటి AI టూల్స్‌ని ప్రొడక్టివిటీ పెంచేందుకు మాత్రమే వినియోగించాలని సూచించారు ప్రధాని. కానీ కొంత మంది వీటిని వేరే విధంగా వాడుకుంటూ తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అటు బిల్‌ గేట్స్ కూడా AI టెక్నాలజీపై ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఊహించని పనులనూ పూర్తి చేస్తున్న ఈ సాంకేతికత...కొన్ని విషయాల్లో మాత్రం విఫలమవుతోందని అన్నారు. ఎన్నో సవాళ్లను దాటాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Breaking News: సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్.. పోలీసులు అనుమతిస్తారా?
సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్.. పోలీసులు అనుమతిస్తారా?
Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్.. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
Embed widget