Adieu Internet Explorer: గుడ్‌బై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఎమోషనల్ అవుతున్న నైన్‌టీస్ కిడ్స్
మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ పూర్తిగా కనుమరుగైంది. ఈ బ్రౌజర్‌ని తొలగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది.
27 ఏళ్ల చరిత్ర ఉన్న బ్రౌజర్‌కి ఇక గుడ్‌బై
ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ ఓపెన్ చేసి టకటకా టైప్ చేసేయటం మనకు అలవాటైపోయింది. గూగుల్ తల్లి అని మనమంతా కలిసి ఓ ముద్దు పేరు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మనకు కావాల్సింది వెతుక్కుంటున్నాం కానీ ఓ 15 ఏళ్ల క్రితం అందరూ ఒకే బ్రౌజర్‌ని వినియోగించే వాళ్లు. ఆ బ్రౌజర్ పేరే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. e సింబల్‌తో కనిపించే ఈ బ్రౌజర్ అప్పట్లో చాలా ఫేమస్ అయింది. డెస్క్‌టాప్ కొనుగోలు చేసిన వాళ్లకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పాటు డిఫాల్ట్‌గా ఈ బ్రౌజర్ వచ్చేది. అప్పటికి మిగతా బ్రౌజర్లు రాకపోవటం వల్ల అందరూ దీన్ని వినియోగించేవాళ్లు. ఈ జనరేషన్ వాళ్లకి పెద్దగా తెలియకపోయినా 90ల్లోని వాళ్లకి ఇది చాలా సుపరిచితం. ఈ బ్రౌజర్ కనిపించగానే చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యేవాళ్లు. ఎప్పుడైతే గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్లు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి క్రమంగా కనుమరుగైంది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. ఇది గమనించిన మైక్రోసాఫ్ట్ సంస్థ 27 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్రౌజర్‌ని పూర్తిగా తొలగిస్తున్నామంటూ ప్రకటించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అభిమానులంతా ఎమోషనల్ అయిపోతున్నారు. మిస్ యూ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.
After 27 years, Microsoft is officially shutting down the Internet Explorer Browser this week. pic.twitter.com/XFCoGSyiav
— Pop Base (@PopBase) June 14, 2022
Goodbyes are never easy.
— Muhammad Saad Ameen (@saadameen01) June 15, 2022
After 27 years, Today, 15 June 2022 Microsoft is officially shutting down Internet Explorer pic.twitter.com/212wAtYIVE
Goodbye #InternetExplorer Will miss the site loading bar! 🥲 pic.twitter.com/CK3ls03XCT
— Vishal Jain (@vishaljain_12) June 15, 2022
ఇకపై మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో బ్రౌజ్ చేసుకోండి: మైక్రోసాఫ్ట్ సంస్థ
ప్రస్తుతం మనం వినయోగిస్తున్న బ్రౌజర్ల యూజర్ ఇంటర్‌ఫేస్‌కి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇంటర్‌ఫేస్‌కి చాలా తేడా ఉంటుంది. ఆన్‌లైన్‌లో గవర్నమెంట్‌కి సంబంధించిన ఏ పని కావాలన్నా ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఉండాల్సిందే. అయితే ఇప్పుడీ బ్రౌజర్‌కి అప్‌డేటెడ్ వర్షన్‌గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ వాడే యూజర్స్ ఇకపై ఆటోమెటిక్‌గా ఎడ్జ్‌కి రీడైరెక్ట్ అయిపోతారు.
అయితే ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో సేవ్ చేసుకున్న డేటాని పొందాలంటే IE Modeని ఎనేబుల్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
యూజర్స్‌కి బెటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇదంతా పక్కన పెడితే అసలు దాదాపు మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న బ్రౌజర్‌ని తొలగించాల్సిన స్థితి ఎందుకొచ్చింది..? అంటే ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి.
ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కి తొలగింపునకు ఈ డ్రాబ్యాక్సే కారణమా..?
1.అప్‌డేట్‌లు రాకపోవటం ఈ బ్రౌజర్‌కి మేజర్ డ్రాబ్యాక్. ఉన్న వర్షన్ కూడా క్రమక్రమంగా హ్యాంగ్ అయిపోవటం, బ్రౌజింగ్ చాలా స్లో అవటం
లాంటి సమస్యలు యూజర్స్‌ని అసహనానికి గురి చేశాయి.
2.సెక్యూరిటీ లేకపోవటం మరో డ్రాబ్యాక్. హ్యాకర్లు చాలా సులువుగా యూజర్స్ డేటాని హ్యాక్ చేయగలిగారు. ఈ విషయంలో భద్రత లేకపోవటం వల్ల యూజర్స్ వేరే బ్రౌజర్‌లకు మళ్లారు.
3.గూగుల్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్‌తో పోల్చి చూస్తే ఫీచర్ల విషయంలోనూ వెనకబడింది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్. బ్రౌజ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఆగిపోవటం వల్ల ఇంపార్టెంట్ డేటాని మిస్ అయిపోవాల్సి వచ్చేది. రిట్రీవ్ చేసుకోవటానికీ చాలా కష్టపడాల్సి వచ్చేది. అదే గూగుల్ క్రోమ్‌లో అయితే రీస్టోర్ ఆప్షన్ ఉంటుంది.
4. కొన్ని యాడ్‌ఆన్స్, ప్లగ్‌ఇన్స్, ఎక్స్‌టెన్షన్స్‌ని ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సపోర్ట్ చేయదు. ఇదే మరో మేజర్ డ్రాబ్యాక్. ఈ విషయంలో యూజర్స్ నుంచి ఎన్ని ఫిర్యాదులు చేసినా మైక్రోసాఫ్ట్ సంస్థ పట్టించుకోలేదు.
5.యూజర్ ఇంటర్‌ఫేజ్ విషయంలోనూ అప్‌డేట్ అవకపోవటం వల్ల యూజర్స్ ఈ బ్రౌజర్‌ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అందుకే పూర్తిగా
గుడ్‌బై చెప్పేసింది సంస్థ.