News
News
X

Curd: పెరుగుతో వీటిని కలిపి తినకండి, అలా చేస్తే మీకు ఈ ఇబ్బందులు తప్పవు

మనలో చాలా మంది మామిడి కాయ, ఉల్లి పాయ నంచుకుని తింటుంటారు. కానీ అలా చేస్తే మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు.

FOLLOW US: 

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడే విటమిన్లు, పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియని మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గేందుకు కూడా ఇది మంచి ఆహారం. అంతేకాదు వజీనా ఇన్ఫెక్షన్స్, అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగుని చేర్చుకోవాలని అంటారు. వేసవి కాలంలో ఒక కప్పు పెరుగుతో అన్నం తింటే ఎంతో హాయిగా ఉంటుంది. ఇక అందులో మామిడి కాయ, అరటికాయ కలుపుకుని తింటుంటే అబ్బా ఏమన్నా ఉంటుందా ఆ రుచే వెరబ్బా. అది చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కానీ అలా తినడం మంచిదికాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగుతో కలిపి ఈ ఐదు పదార్థాలు జోడించి తినడం హానికరమని అంటున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా 

చేప 

చేపలతో కలిపి పెరుగు తినకూడదు. ఇవి రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. యానిమాల ప్రోటీన్ తో కలిపి వెజ్ ప్రోటీన్ ని కలపడం వల్ల వాటిని మానవ శరీరం జీర్ణం చేసుకోవడం కష్టం అవుతుంది. అంతేకాదు కడుపులో నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవి రెండు కలిపి తీసుకోకపోవడం ఉత్తమం. 

ఆయిల్ ఫుడ్స్ 

పరోటా, చపాతీ, పూరీ వంటి ఆయిల్ ఫుడ్స్ తో కలిపి పెరుగు తినకూడదు. ఇవి జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల రోజంతా మనకు బద్దకంగా అనిపిస్తుంది. 

మామిడి కాయ 

వేసవి కాలం వచ్చిందంటే మామిడికాయలకు కొదవే ఉండదు. వాటిని పెరుగన్నంలో కలుపుకుని తింటుంటే వచ్చే మజా సూపర్ గా ఉంటుంది. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మామిడి వేడి పదార్థం, పెరుగు చల్లటి గుణాన్ని కలిగి ఉంటుంది. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ స్తబ్దుగా ఉండటంతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. 

ఉల్లిపాయ 

మన ఇళ్ళల్లో చాలా మంది పెద్దవ్యయాలు పెరుగన్నంలో ఉల్లిపాయ నంచుకుని తింటూ ఉండటం చూస్తూ ఉంటాం. కాని అలా చెయ్యకూడదు. మామిడి లాగా ఇది కూడా వేడి కలిగించే స్వభావం ఉన్నదే. అందుకే ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల దద్దుర్లు, అలర్జీ, సోరియాసిస్ వంటి చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 

పాలు 

అవును మీరు విన్నది నిజమే. పాల నుంచి వచ్చేది పెరుగు. కానీ ఆ పాలతో కలిపి తీసుకుంటే మాత్రం అది ఆరోగ్యానికి హానికరం. అవి రెండు కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ రెండింటిలోనూ ప్రోటీన్లు, కొవ్వు పడతాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని కలిపి తీసుకోవడం మంచిది కాదు. 

Also read: టీనేజీ పిల్లల్లో హింసాత్మక భావాలను, కోపాన్ని పెంచేస్తున్న వీడియో గేమ్స్, తల్లిదండ్రులూ జాగ్రత్త

Also read: ఈ నాలుగు పానీయాలు మీ తలనొప్పిని తీవ్రంగా మారుస్తాయి, తాగకపోవడం మంచిది

Published at : 13 Jul 2022 03:12 PM (IST) Tags: Curd Curd with Mango Curd Side Effects Avoid Curd With These Foods

సంబంధిత కథనాలు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

Fish Rice: ఫిష్ ఫ్రైడ్ రైస్, ఇంట్లో ఈజీగా ఇలా చేయచ్చు

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

గుండె జబ్బులు రాకూడదంటే ఈ ఆహారాన్ని తీసుకోండి

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

ఖాళీ కడుపున బ్రెడ్ తింటున్నారా? అయితే ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్టే!

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

Face Rollers: ఈ ఫేస్ రోలర్ టూల్ వల్ల ఉపయోగమేంటి? అందం పెరుగుతుందా?

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

National Rum Day: రమ్ తాగుతారా? దాన్ని దేనితో తయారుచేస్తారో తెలిస్తే షాకైపోతారు

టాప్ స్టోరీస్

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ-  పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు !  విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?

JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?