By: Haritha | Updated at : 13 Jul 2022 07:37 AM (IST)
(Image credit: Pixabay)
ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య తలనొప్పి. అనేక రకాల కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. నిద్ర తగ్గడం, ఒత్తిడి, హ్యాంగోవర్, డీ హైడ్రేన్, చూపు సమస్యలు, అలెర్జీలు... వంటి వాటి వల్ల తలనొప్పి అధికంగా వస్తుంది. అలా తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని రకాల పానీయాలు తాగడం వల్ల ఆ నొప్పి తీవ్రంగా మారుతుంది. అవి ఆరోగ్యకరమైనవే అయినా తలనొప్పి వేధిస్తున్నప్పుడు, నిద్రలేమితో ఉన్నప్పుడు, ఒత్తిడితో ఉన్నప్పుడు వాటిని తాగకూడదు. దీని వల్ల తలనొప్పి తీవ్రంగా మారిపోతుంది. ఈ పానీయాలు సాధారణ వ్యక్తులు తాగిన ఫర్వాలేదు. తరచూ తలనొప్పితో బాధపడేవారు ఈ పానీయాలకు దూరంగా ఉండడం మంచిది.
బీర్ లేదా వైన్
బీర్‌ను పులియబెట్టిన బార్లీ నుంచి తయారుచేస్తారు. అలాగే వైన్ ను పులిసిన ద్రాక్ష నుంచి వైన్ తయారవుతుంది. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యకరమైనా పానీయాలుగా మారాయి. అయినప్పటికీ వీటిలో కొంత శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది అధికంగా మూత్ర విసర్జన చేసేలా చేస్తుంది. ఎలక్ట్రోలైట్లను కోల్పోయేలా చేస్తుంది. దీని వల్ల డీ హెడ్రైషన్ పెరుగుతుంది. తలనొప్పి ఇంకా తీవ్రంగా మారుతుంది.
కాఫీ
తలనొప్పి రాగానే సగానికి పైగా జనం కాఫీ తాగడానికి సిద్ధపడిపోతారు. కెఫీన్ అధికంగా ఉండే కాఫీ నిద్ర లేమి సమస్యను పెంచేస్తుంది. స్లీప్ అప్నియా, ఇన్ సోమ్నియా లక్షణాలను పెంచుతుంది. దీంతో తలనొప్పి కూడా అధికమవుతుంది. కాబట్టి కాఫీని అధికంగా తాగడం మానివేయాలి. ముఖ్యంగా సాయంత్రం దాటాకా తాగకూడదు.
ఎనర్జీ డ్రింకులు
ఎనర్జీన డ్రింకులు తాత్కాలికంగా శక్తిని ఇస్తాయి. కానీ ఎక్కువ కాలం వాటి వల్ల లాభం ఉండదు. వీటి వల్ల డీ హైడ్రేషన్, నిద్ర లేకపోవడం, అలసట వంటివి వేధిస్తాయి. ఇవన్నీ కూడా తలనొప్పిని మరింతగా పెంచేవే. వీటిలో కూడా కెఫీన్, చక్కెర అధికంగా ఉంటుంది.
పండ్ల రసాలు
పండ్లు తింటే చాలా ఆరోగ్యం. కానీ పండ్ల రసాల వల్ల మాత్రం నష్టమే. అందులో అదనపు రుచి కోసం పంచదార కలుపుతారు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఈ పరిస్థితి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది తలనొప్పికి కారణం అవుతుంది. హైడ్రేటెడ్ గా ఉండడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా మంచిది.
Also read: పక్కవారు వదిలిన సిగరెట్ పొగ పీలుస్తున్నారా? అయితే ఈ సమస్యలు కోరి తెచ్చుకున్నట్టే
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే
Christmas Gifts : క్రిస్మస్కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి
Winter Foods For Glowing Skin : వింటర్లో చర్మాన్ని పొడిబారకుండా చేసే ఫుడ్స్ లిస్ట్ ఇదే
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
/body>