By: ABP Desam | Updated at : 14 Apr 2022 04:34 PM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
ప్రపంచంలోనే అతి ఎత్తయిన మనుషులు వీరంతా. ఒకరు కాదు ఇద్దరు కాదు, కుటుంబమంతా ఎత్తు మనుషులే. అందుకే ప్రపంచంలోనే అతి ఎత్తయిన కుటుంబంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కింది వారి ఫ్యామిలీ. వారిలో ఒక్కొక్కరి ఎత్తు ఆరడుగుల మూడు అంగుళాలకు తక్కువ కాకుండా ఉంది. ఈ కుటుంబం నివసించేది అమెరికాలోని మిన్నోసోటాలో. ఈ ఫ్యామిలీ పేరు ‘ట్రాప్ ఫ్యామిలీ’. ఈ కుటుంబంలో అత్యి పిన్న వయస్కుడు 22 ఏళ్ల ఆడమ్ ట్రాప్. ఇతని ఎత్తు ఏడు అడుగుల మూడు అంగుళాలు.
ట్రాప్ ఫ్యామిలీలో అతి పొట్టి వ్యక్తి ఆ ఇంటి ఇల్లాలు క్రిసీ. ఈమె ఎత్తు ఆరు అడుగుల మూడు అంగుళాలు. తండ్రి స్కాట్ ఎత్తు ఆరడుగుల ఎనిమిది అంగుళాలు. వీరి ముగ్గురి పిల్లలు చాలా ఎత్తు పెరిగారు. ఆడమ్, సవన్నా, మోలీలలో ఆడమ్ అందరి కన్నా ఎత్తు ఎక్కువ. ఇక సవన్నా ఎత్తు ఆరడుగుల ఎనిమిది అంగుళాలు కాగా, మోలీ ఎత్తు ఆరడుగుల ఆరు అంగుళాలు. ముగ్గురు పిల్లలు కాలేజీలో స్పోర్ట్స్ లో రాణిస్తున్నారు. వాలీబాల్, బాస్కెట్ బాల్ జట్టులో వీరు తప్పకుండా ఉంటారు. వీరు ఎత్తు ఎక్కువ కాబట్టి గోల్స్ అధికంగా చేయగలుగుతారు. వీరు ఎప్పటికప్పుడు తమ ఎత్తును చూసుకుంటూ ఉంటారు. రోజులో మూడు సార్లు చూసి నోట్ చేస్తుంటారు. తాము ఎత్తు ఎంత వేగంగా పెరుగుతున్నామో తెలుసుకోవడానికే వారి ఇలా చేస్తున్నారు. చేయెత్తితే వీళ్ల ఎత్తుకి ఇంటి పై ఫ్లోర్ కూడా తగులుతుంది.
Also read: తినకూడని ఆహార కాంబినేషన్లు ఇవే, తింటే ఆరోగ్యం చిక్కుల్లో పడ్డట్టే
Also read: అందంగా ఉండడమే ఆ గ్రామానికి శాపమా? వద్దన్నా వస్తున్న పర్యాటకులు
Live with Leopards: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Tattoo Child: ఆ పసివాడి ఒళ్లంతా పచ్చబొట్లే, తల్లిని తిట్టిపోస్తున్న జనం, కానీ అసలు కథ వేరే ఉంది!
Dandruff Treatment: చుండ్రు ఏర్పడటానికి కారణాలివే, రోజూ ఇలా చేస్తే మళ్లీ రమ్మన్నారాదు!
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Bad Body Odour: శరీర దుర్వాసన చికాకు పెడుతోందా? ఈ చిట్కాలు మీ కోసమే!
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి