By: ABP Desam | Updated at : 14 Apr 2022 11:08 AM (IST)
Edited By: harithac
(Image credit: Instagram)
గలగల పారే నది... ఆ నది ఒడ్డు వెంబడి చిన్న గ్రామం. ఇళ్లన్నీ ఒడ్డునే ఉండడం ఈ గ్రామం విశేషం. అందుకే నిత్యం ఆ గ్రామానికి పర్యాటకులు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడదే ఆ ఊరి సమస్యగా మారిపోయింది. ఈ అందమైన గ్రామం ఉన్నది ఆస్ట్రియా దేశంలో. పేరు ‘హాల్‌స్టట్’. పర్యాటకులు వస్తే మంచిదేగా, వ్యాపారం బాగా జరుగుతుంది అని వాదించవచ్చు. కానీ వారికి వ్యాపారానికి మించి వారికి తలనొప్పులు ఎక్కువపోతున్నాయి. చిన్న గ్రామం కావడంతో నిత్యం కొత్త మనుషులు తిరగడం వారిలో అసౌకర్యాన్ని, భయాన్ని కూడా పెంచుతోంది.
ఇన్ స్టాగ్రామ్ వల్లే...
ఈ గ్రామంలో వసలి సౌకర్యం లేదు. వచ్చిన ఓ రెండు మూడు గంటల్లో ఊరిని చూసి వెళ్లిపోవాలి. అయినా ఎందుకిలా పర్యాటకులు రోజూ వందల్లో వచ్చిపడతారో తెలుసా? ఇన్‌స్టా పోస్టుల కోసం. ఈ విలేజ్ బ్యాక్‌గ్రౌండ్లో ఇన్‌స్టా రీల్స్, ఫోటోలు తీసుకుని పోస్టు చేస్తే వాటికొచ్చే లైకులు, షేర్లు మామూలుగా ఉండవు. అందుకే ఈ గ్రామం ‘ఇన్‌స్టాగ్రామ్ విలేజ్’ గా పేరు తెచ్చుకుంది. వేల మంది ఇన్ స్టా ఖాతాల్లో కచ్చితంగా ఈ గ్రామం కనిపిస్తుంది.టూరిస్టుల తాకిడి తట్టుకోలేక ఇకపై వచ్చే వారికి నియమ నిబంధనలు ఏర్పాటుచేయాలనుకుంటున్నట్టు గ్రామపెద్దలు చెబుతున్నారు. రోజులో గ్రామానికి వచ్చే వారి సంఖ్యను కూడా నిర్ణయించి, అంతకుమించి రాకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. కరోనా వైరస్ వంటి మహమ్మారులు నియంత్రణలో లేని కాలంలో కూడా పర్యాటకులు రావడం వారికి చాలా తలనొప్పిని తెచ్చి పెట్టింది. స్థానిక ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఈ గ్రామాన్ని టూరిస్టుల బారి నుంచి కాపాడాలని నిర్ణయించాయి.
జనాభా ఎంతంటే...
చిన్న కుగ్రామం హాల్‌స్టట్.దీని జనాభా కేవలం 800. ఈ గ్రామానికి ఎప్పుడో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు సాధించింది. ఈ గ్రామాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవు. మంచు కురిసే వేళలో మరింత అందంగా కనిపిస్తుంది. ఆ గ్రామం ఫోటోలను కింద ఇచ్చిన ఇన్ స్టా ఖాతాలో చూడవచ్చు.
Brain Foods: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే బ్రెయిన్ ఫుడ్స్ ఇవన్నీ, రోజుకొకటైనా తప్పకుండా తినిపించాల్సిందే
Sleeping Pills: స్లీపింగ్ పిల్స్ అధికంగా వాడుతున్నారా? వాటి వల్ల కలిగే నష్టాలు ఇవే
Amazon: ఒక ప్లాస్టిక్ బకెట్ ఇరవై ఆరువేల రూపాయలా? అది కూడా ‘సోల్డ్ అవుట్’
Happy Hormone: మానసికంగా కుంగిపోతున్నారా? మీ హ్యాపీ హార్మోన్ సరిగా పనిచేయడం లేదేమో
Thegalu: వీటి పేరేంటో తెలుసా? తింటే ఎంత రుచిగా ఉంటాయో, అంత ఆరోగ్యం కూడా
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్
Mahesh Babu Trivikram Movie Update: మహేష్ బాబు సినిమాకూ త్రివిక్రమ్ 'అ' సెంటిమెంట్‌తో వెళతారా?
Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!