World Day for Safety and Health At Work 2024 : నేడే వరల్డ్ సేఫ్టీ డే - ఈ రోజు ప్రత్యేకత ఏంటి? దీన్ని ఎందుకు జరుపుకోవాలి
World Safety and Health At Work 2024: ప్రతిఒక్కరికీ సురక్షితమై, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని పొందే హక్కు ఉంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 28న వరల్డ్ సేఫ్టీ డే నిర్వహిస్తున్నారు.
World Day for Safety and Health At Work 2024 : ప్రతి మనిషికి ఒక ప్రాథమిక సూత్రంగా సురక్షితమైన,ఆరోగ్యకరమైన పని వాతావరణం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28న పని వద్ద భద్రత, ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ (ILC) జూన్ 2022లో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రాథమిక సూత్రాలు, హక్కుల ఫ్రేమ్‌వర్క్‌లో "సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్న కలిపించాలని నిర్ణయించింది. కార్మికులందరికీ సురక్షితమై, ఆరోగ్యకరమైన పని పరిస్థితులను కల్పించడం దీని బాధ్యత. యజమానులు, ప్రభుత్వాలు ఏకతాటికిపైకి వచ్చి సురక్షితమైన ఆఫీసులను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసేందుకు కట్టుబడి ఉండేందుకు ఇక మంచి అవకాశం. పని వద్ద భద్రత, ఆరోగ్యం కోసం ప్రపంచ దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత, కార్యలాపాల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
ప్రాముఖ్యత:
ఈ రోజుల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి భద్రతతోపాటు ఆరోగ్యానికి సంబంధించి భరోసా కల్పించడం అనేది స్పష్టం కనిపిస్తోంది. ఉద్యోగంలో అనుకోని ప్రమాదాలు, వ్యాధులు అనేవి ప్రధాన సమస్య. ఇలాంటి సమస్యలతో ఏటా 2.3 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణనష్టం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య వ్యవస్థల అవసరాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం, భద్రతా చర్యలను హైలైట్ చేయడానికి, కార్యాలయాన్ని ప్రజలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి మార్గాలను అన్వేషించడానికి ప్రపంచ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
చరిత్ర:
ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వృత్తిపరమైన ప్రమాదాలు, వ్యాధులు నివారించడమే లక్ష్యంగా ఈ రోజును పాటించాలని వెల్లడించింది. ఈ సమస్యపై అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా.. ఆరోగ్యకరమైన పని సాంప్రదాయాన్ని ప్రోత్సహించడమే World Day for Safety and Health At Work ముఖ్య ఉద్దేశం. 1996లో ట్రేడ్ యూనియన్ ఉద్యమ ఫలితంగా ఏప్రిల్ 28 పని ప్రదేశాల్లో చనిపోయిన లేదా గాయపడిన కార్మికులకు సంబంధించి అంతర్జాతీయ స్మారక దినోత్సవం. ఈ దినోత్సవం రోజు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించడమే కాకుండా ఈ సమస్యలపై అవగాహన కలిగించే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.
అవగాహన కార్యక్రమాలు:
World Day for Safety and Health At Work రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సంస్థలు, ట్రేడ్ యూనియన్‌ల వివిధ అవగాహన ప్రచారాలు, వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో కార్మికులు, యజమానులు, సాధారణ ప్రజలకు కార్యాలయ భద్రత, ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి అవగాహన కలిపిస్తారు. అనేక దేశాలు కూడా ఏప్రిల్ 28న వర్కర్స్ మెమోరియల్ డేని పాటిస్తూ పనికి సంబంధించిన సంఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన లేదా గాయపడిన వారిని గౌరవిస్తాయి. కాబట్టి.. ఈ రోజు మీరు కూడా కార్మికులు, ఉద్యగుల భద్రత కోసం జరిపే కార్యక్రమాల్లో పాల్గొని.. అందరికీ అవగాహన కల్పించండి.
Also read : Eye care tips: వేసవిలో ఒళ్లే కాదు.. కళ్లు కూడా జర భద్రం - ఈ పనులు అస్సలు చేయొద్దు, ఈ చిట్కాలు పాటించండి