వామ్మో.. రోజుకు 70 సార్లు వాంతులు, ఆమె ఎదుర్కొంటున్న ఈ సమస్య మీకు రావచ్చు!
ఒకటి కాదు రెండు కాదు రోజుకు 70 పైగా వాంతులతో ఆమె బాధపడుతోంది. ప్రతి రోజూ ఇదే సమస్యతో బాధపడుతున్న ఆ మహిళకు ఏర్పడిన సమస్య మీలోనూ ఏర్పడవచ్చు.
ఒకటి రెండు వాంతులైనే మనకు నీరసం వచ్చేస్తుంది. అలాంటిది ఆ మహిళకు రోజుకు 70 సార్లు వాంతులు అవుతున్నాయి. అయితే, ఇది ఒకటి రెండు రోజులు వచ్చే సమస్య కాదు. ప్రతి రోజూ ఇదే పరిస్థితి. దీంతో ఆమె ఎంత నరకయాతన అనుభవిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్లాండ్‌లోని బోల్టన్‌కు చెందిన లిన్నే విలన్ అనే 39 ఏళ్ల మహిళ అరుదైన సమస్యతో బాధపడుతోంది. రోజూ ఆమెకు కడుపులో నొప్పి, వికారం వస్తుంది. ఏం తిన్నా.. తాగినా.. వాంతైపోతుంది. ఈ సమస్య వల్ల ఆమె బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. దీనివల్ల ఆమె ఏమీ తినలేదు. తిన్నా.. జీర్ణించుకోలేదు. ఈమె ఎదుర్కొంటున్న ఈ అరుదైన పరిస్థితిని ‘గ్యాస్ట్రోపరేసిస్’ అంటారని వైద్యులు తెలిపారు.
‘గ్యాస్ట్రోపరేసిస్’ సమస్య వల్ల ఆమె తినే ఆహారం చాలా నెమ్మదిగా కడుపు నుంచి వెళ్తుంది. ఫలితంగా ఆమె కడుపులోకి వెళ్లిన ఆహారం అంత సులభంగా జీర్ణం కాదు. దీంతో వికారం ఏర్పడి.. వాంతులైపోతున్నాయి. 2008 నుంచి లిన్నే ఈ సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో వైద్యులు ఆమెకు వాంతులు రాకుండా ఉండేందుకు గ్యాస్ట్రిక్ ఫేస్‌మేకర్‌ను అమర్చారు. మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ నివేదిక ప్రకారం.. రెండేళ్ల తర్వాత ఆమెకు అమర్చిన పరికరం బ్యాటరీ అయిపోయింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. మళ్లీ ఆ పరికరం అమర్చాలంటే రూ.10 లక్షలు వరకు ఖర్చవుతుంది.
కూతురికి దూరంగా..: ఈ పరిస్థితి వల్ల ఆమె తన కుమార్తెను కూడా దగ్గరకు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ‘‘నేనేప్పుడు.. అనారోగ్యం, నొప్పితో బాధపడుతుంటాను. ఈ పరిస్థితి నా కుటుంబాన్ని దూరం చేసింది. నాకు 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే నాకు బిడ్డ పుట్టింది. కానీ, నా అనారోగ్యం వల్ల నా కూతురితో సంతోషంగా గడపలేకపోయా. నేను ఏం తాగినా.. బయటకు వచ్చేస్తుంది. ఎంతో నరకం చూస్తున్నాను’’ అని తెలిపింది.
గ్యాస్ట్రోపరేసిస్ అంటే?: మీ కడుపులోని కండరాల సాధారణ ఆకస్మిక కదలికను (చలనశీలత) ప్రభావితం చేసే పరిస్థితిని గ్యాస్ట్రోపరేసిస్ అంటారు. సాధారణంగా, బలమైన కండరాల సంకోచాలు మీ జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారాన్ని ముందుకు నడిపిస్తాయి. కానీ, గ్యాస్ట్రోపరేసిస్ సమస్య గల వ్యక్తుల్లో ఆ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ సమస్య మీలో కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందుకు కారణాలివే.
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
గ్యాస్ట్రోపరేసిస్‌కు కారణమేమిటి?
⦿ అన్నవాహిక, కడుపు లేదా చిన్న ప్రేగులలో శస్త్రచికిత్స వల్ల వాగస్ (గొంతు నుంచి ఉదరం వరకు ఉండే నరాలు) గాయపడితే ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
⦿ హైపోథైరాయిడిజం.
⦿ స్క్లెరోడెర్మా వంటి వ్యాధులు.
⦿ పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి కొన్ని నాడీ సంబంధిత వ్యాధులు.
⦿ కడుపులోని వైరల్ ఇన్ఫెక్షన్లు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క కుదిర్చారు!