Winter AC Maintenance : చలికాలంలో ACని పూర్తిగా ఆఫ్ చేసి ఉంచవచ్చా? పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
AC Servicing Tips : చలికాలంలో ఏసీ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తిగా పక్కన పెట్టేయొచ్చా? అలా చేస్తే ఏసీ పాడవుతుందా? ఏసీ టెక్నీషియన్లు ఇస్తోన్న సూచనలు ఇప్పుడు చూసేద్దాం.

Winter AC Maintenance Tips : చలికాలంలో ఏసీ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. సమ్మర్లో ఎక్కువగా ఉపయోగించినా.. చలికాలంలో చలివల్ల దానిని పూర్తిగా పక్కన పెట్టేస్తారు కొందరు. మళ్లీ సమ్మర్ వరకు దానిని ఉపయోగించకూడదు అనుకుంటారు. మరి అలాంటి సమయంలో అంటే చలికాలంలో ACకి సర్వీసింగ్ చేయడం అవసరమా? దాని గురించి ఏసీ ఎక్సపర్ట్స్ ఏమి చెప్తున్నారు. చలికాలంలో ఏసి వినియోగంపై వారు సూచించే సలహాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
చలికాలం అని ACని పూర్తిగా పక్కన పెట్టేస్తే.. దాని పనితీరుపై నెగిటివ్ ప్రభావం ఉంటుంది. అందుకే ఏసీ ఎక్స్పర్ట్స్ చలికాలంలో కూడా దానికి సర్వీసింగ్ అవసరమని చెప్తున్నారు. సర్వీసింగ్ చేయించడం వల్ల సిస్టమ్ శుభ్రంగా ఉంటుందని.. దానివల్ల ఏసీ శక్తి, సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని.. అలాగే గ్యాప్ తర్వాత వేసవిలో AC ఉపయోగించినా ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తున్నారు. అందుకే చలికాలం ప్రారంభానికి ముందు ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.
AC సర్వీసింగ్ ఎందుకు అవసరం
చలికాలంలో ACని ఉపయోగించము అనుకుంటారు కాబట్టి దానికి సర్వీసింగ్ చేయించాల్సిన అవసరం ఉండదనుకుంటారు. అది పెద్ద తప్పు. వాస్తవానికి ACని ఎక్కువ కాలం ఉపయోగించకపోతే.. దానిలోని ఫిల్టర్లు, కాయిల్‌లలో దుమ్ము, తేమ పేరుకుపోతాయి. తర్వాత మీరు ACని ఆన్ చేసినప్పుడు.. చల్లని గాలితో పాటు వాసన కూడా రావచ్చు. అలాగే సిస్టమ్‌పై లోడ్ పెరుగుతుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని కూడా పెంచుతుంది.
అందుకే నిపుణులు సంవత్సరానికి కనీసం రెండుసార్లు ACని సర్వీసింగ్ చేయడం అవసరమని చెబుతున్నారు. వేసవికి ముందు ఒకసారి.. చలికాలంలో ఒకసారి చేయిస్తే.. మెషిన్ లైఫ్‌టైమ్ పెరుగుతుందని.. అలాగే ఏసీ సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తున్నారు.
ఏసీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చలికాలంలో ACని ప్రాథమికంగా శుభ్రపరచడం చాలా ముఖ్యం. ముందుగా ఫిల్టర్‌లను తీసివేసి.. వాటిని తేలికపాటి నీరు, సబ్బుతో కడగాలి. అనంతరం బాగా ఆరనివ్వాలి. ఇండోర్ యూనిట్ కాయిల్, అవుట్‌డోర్ యూనిట్ కండెన్సర్‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. తద్వారా దుమ్ము లేదా తేమ ఉండకుండా ఉంటుంది. గ్యాస్ స్థాయి పైప్ కనెక్షన్లు, వెంట్‌లను కూడా ఏసీ టెక్నీషియన్‌తో చెక్ చేయించుకోవాలి. మీ ACలో హీటర్ మోడ్ ఉంటే మరీ మంచిది. చలికాలంలో కూడా దీనిని వినియోగించుకోవచ్చు.
సర్వీసింగ్ తర్వాత అన్ని సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అందుకే సర్వీసింగ్ తర్వాత దానిని రన్ చేయాలి. రెగ్యులర్‌గా సర్వీసింగ్ చేయించడం వల్ల ఏసీ ఇబ్బందులు రావు. వేసవిలో కూడా AC బాగా పని చేసి.. త్వరగా రూమ్ చల్లగా మారుతుంది. సర్వీసింగ్, మెయింటైన్స్కి తక్కువ ఖర్చు పెడితే.. తర్వాత కాలంలో పెద్ద ఖర్చులు అవ్వకుండా ఉంటాయి.






















