సమ్మర్​లో ఏసీలను ఎక్కువమంది ఉపయోగిస్తారు.

వేడిని తట్టుకునేందుకు గదిని చల్లగా మార్చేందుకు ఏసీని ఉపయోగిస్తారు.

ప్రపంచంలోనే ఏసీ మార్కెట్లలో అత్యంత వేగంగా ఇండియా అభివృద్ధి చెందుతుంది.

భారత్​లో మార్కెట్ డిమాండ్ ఇంత ఉంటే.. ఎక్కువ మంది దీనిని వినియోగిస్తున్నారనుకుంటారు.

కానీ ఈ గణాంకాలు పూర్తి భిన్నంగా.. షాక్​ అయ్యేలా ఉన్నాయి.

ఫ్యాక్ట్ ఏంటి అంటే భారతదేశంలో కేవలం 7 శాతం ఇళ్లలోనే ఏసీ ఉపయోగిస్తున్నారట.

అంటే 100 ఇళ్లులు ఉంటే.. వాటిలో 7 ఇళ్లల్లోనే ఏసీని వినియోగిస్తున్నారట.

మిగిలిన 93 ఇళ్లల్లో ఇప్పటికీ ఫ్యాన్లు, కూలర్లు వినియోగిస్తున్నారట.

ఏసీని ఉపయోగించాలని అందరికీ ఉన్నా.. దానిని కొనుక్కోకపోవడం వెనుక ఓ రీజన్ ఉంది.

అదే ధర. ఎక్కువమంది దీనిని సమ్మర్​లో కొనేందుకు చూస్తారు. ఆ సమయంలో కాస్ట్ ఎక్కువగా ఉండడంతో కొనరు.