ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పిల్లలకు ఇవి పెడితే కలిగే లాభాలు ఏంటో చూద్దాం.

రోజూ పిల్లల డైట్​లో ఎండుద్రాక్షలు ఇవ్వడం వల్ల వారు ఎనర్జీటిక్​గా ఉంటారు.

వీటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియను మెరుగు చేస్తుంది.

వీటిలో కాల్షియం, బోరాన్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసి పెరుగుదలను ప్రోత్సాహిస్తాయి.

ఇమ్యూనిటీని పెంచడంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఐరన్ లెవెల్స్​ని పెంచి ఎనిమియా సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తాయి. రక్తహీనత తగ్గుతుంది.

పంటి ఆరోగ్యానికి మంచిది. నోట్లో చెడు బ్యాక్టీరియా పెరగకుండా, పిప్పళ్లు రాకుండా హెల్ప్ చేస్తుంది.

వీటిలోని సహజమైన షుగర్​లు, పోషకాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. చదువుపై ఫోకస్ చేయగలుగుతారు.

వీటిని డ్రైఫ్రూట్స్ లేదా యోగర్ట్​లో కలిపి ఇవ్వొచ్చు. రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఇస్తే మరీ మంచిది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.