Sleepy Face: నిద్రపోయి లేచిన తర్వాత ముఖం ఎందుకలా ఉబ్బిపోతుంది? అది దేనికి సంకేతం?
నిద్ర ముఖాన్ని దాచడం అంత ఈజీ కాదు. పడుకుని లేచిన తర్వాత.. ముఖాన్ని చూసి ఆ వ్యక్తి నిద్రపోయాడో లేదో చెప్పేయొచ్చు. మరి, నిద్రపోతున్నప్పుడు ముఖం ఎందుకు ఉబ్బుతుంది?
నిద్రపోయి లేచిన తర్వాత మైండ్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. కానీ, ముఖం చూస్తే వాచిపోయినట్లుగా ఉంటుంది. కళ్లు కూడా ఉబ్బుతాయి. నిద్ర లేచిన తర్వాత మన ముఖంలో ఒక రకమైన లేజీ లుక్ కనిపిస్తుంది. అందుకే, చాలామంది నిద్ర ముఖాన్ని ఈజీగా కనిపెట్టేస్తారు. ముఖ్యంగా ఎక్కువసేపు నిద్రపోతే ముఖం అలా మారిపోతుంది. అలా ఎందుకు జరుగుతుందనేది చాలామందికి తెలీదు. అయితే, అదేదో అనారోగ్యానికి సంకేతమని భావిస్తారు. ముఖం ఉబ్బడం లేదా వాపు అనేది పెద్ద సమస్య కాదు. అందరికీ ఇలాగే జరుగుతుంది.
సుదీర్ఘ రాత్రి నిద్ర తర్వాత మన రూపాన్ని మార్చడానికి అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిర్జలీకరణం, నిద్రపోయే భంగిమ ఇలా చాలానే ఉన్నాయి. ముఖం అలా ఉబ్బిపోవడాన్ని ‘ఫేషియల్ పఫ్నెస్’ అని అంటారు. అంటే ముఖ కణజాలం వాపు. ముఖంలోని కణజాలంలో ద్రవం పేరుకుపోవడం వల్ల ఇది ఏర్పడుతుంది. ఇది చర్మం కింద ఉండే కణజాలం వద్ద ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా భాగాల్లోని చర్మం పైకి ఉబ్బుతుంది.
మెడికల్ న్యూస్ టుడేలో పేర్కొన్న వివరాల ప్రకారం.. నిద్రపోతున్నప్పుడు సాధారణం కంటే ఎక్కువ ద్రవం మీ ముఖంలో పేరు చుట్టూ పేరుకుపోతుంది. ఇది ఎక్కువగా పగటి వేళల్లోనే జరుగుతుంది. నిద్ర వ్యవధిని బట్టి ద్రవాల చేరిక భిన్నంగా ఉంటుంది. ఒక వేళ వెనక్కి తిరిగి నిద్రపోతే.. ద్రవాలు వేరే మార్గం ద్వారా ప్రయాణించి వాపు కలిగిస్తాయి. ముఖం వాపుపై మీరు పెద్ద కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను సులభంగానే పరిష్కరించుకోవచ్చు.
Also Read: రోజూ స్నానం చేయడం లేదా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్: స్టడీ
ఈ వాపు తాత్కాలికం మాత్రమే. అతిగా నిద్రపోయేవారిలో ఇలా ద్రవాలు చేరుతాయి. నిద్ర లేచిన తర్వాత కాసేపు నిలబడినా.. వాకింగ్ చేసినా ముఖం మళ్లీ సాధారణంగా మారిపోతుంది. ముఖంలో పేరుకున్న ద్రవాలు వాటికవే మాయమవుతాయి. వివిధ ఆహారాలు, మేకప్, ఆల్కహాల్, సైనస్ ఇన్ఫెక్షన్, ఒత్తిడి, అలెర్జీలు, హైపోథైరాయిడిజం, కుషింగ్స్ సిండ్రోమ్ కూడా వల్ల కూడా ముఖం ఉబ్బుతుంది. పఫ్నెస్ లేదా వాపు.. స్లీపింగ్ పొజిషన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖాన్ని పైకి పెట్టి వెల్లకిలా నిద్రపోయేవారి కంటే.. కిందికి పెట్టుకుని నిద్రించేవారి ముఖం ఎక్కువుగా ఉబ్బుతుందని నిపుణులు తెలిపారు. కాబట్టి.. స్లీపింగ్ పొజీషన్ మార్చడం ద్వారా ముఖం ఉబ్బకుండా జాగ్రత్తపడవచ్చు.
Also Read: సైలెంట్‌గా ఉండేవారు అంత డేంజరా? ఈ కారణాలు తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు!