అన్వేషించండి

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

డైరీ ఉత్పత్తులు వల్ల కొంతమందికి చర్మ అలర్జీ, మొటిమలు సమస్య ఎక్కువగా వస్తుంది. వేసవిలో పెరుగు తింటే ఆ సమస్య ఎక్కువేనని భయపడతారు. అది నిజమేనా?

ఎండకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాల జాబితాలో పెరుగు ఉంటుంది. వేసవిలో పొట్ట ఆరోగ్యంగా, చల్లగా ఉండాలంటే పెరుగు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రొబయోటిక్స్ ఉన్నాయి. మంచి మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కానీ పెరుగు తిన్న తర్వాత కొంతమందికి మొటిమలు, చర్మ అలర్జీలు, జీర్ణ సమస్యలు, శరీరంలో అధిక వేడిగా అనిపించడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. పెరుగులో వేడి చేసే లక్షణాలు కంటే శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి.

ఆయుర్వేదం ప్రకారం, ప్రాచీన భారతీయ వైద్య విధానం ప్రకారం వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల శరీరంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. వాత, పిత్త, కఫ దోషాలపై ఆదరపడి ఉంటుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పెరుగుకి బదులు మజ్జిగ తీసుకోవడం మంచిదని సూచిస్తారు.

పెరుగు శరీరంలో వేడిని ఎందుకు పెంచుతుంది?

శరీరానికి చలువ చేస్తుందని పెరుగు తింటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగు రుచిలో పుల్లగా ఉంటుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. ఇది కఫ, పిత్త దోషాల్లో ఎక్కువ, వాత దోషంలో తక్కువ. అందుకే ఏ సీజన్ లో అయినా పెరుగు తినేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వేసవిలో పెరుగు తింటే కొందరికి శరీరంలో వేడి పెరుగుతుంది. అలాగే ఆరోగ్యమని భావించి అధికంగా తీసుకుంటే ముఖంపై మొటిమలు వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కానీ పెరుగుని సరైన పద్ధతిలో తీసుకునే ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు.

పెరుగు తినే మార్గాలు

పెరుగుని వేసవిలో రోజూ తినకూడదు. రాళ్ళ ఉప్పు, ఎండు మిర్చి, జీలకర్ర వంటి మసాలా దినుసులు జోడించుకుని మజ్జిగ రూపంలో మాత్రమే రోజూ తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. పెరుగులో నీటిని కలిపినప్పుడు అది వేడి ప్రభావాలను సమతుల్యం చేస్తుంది. నీరు వేడిని తగ్గిస్తుంది. పెరుగుకు శీతలీకరణ ప్రభావాన్ని పెంచుతుంది. అందుకే వేసవిలో దాన్ని తీసుకోవాలని అనుకుంటే అందులో నీరు ఎక్కువగా వేసుకుని మజ్జిగ అన్నం మాదిరిగా చేసుకుంటే తింటే మంచిది. దీని వల్ల శరీరానికి చల్లదనంతో పాటు ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలు చేకూరతాయి.

అలాగే పెరుగుని వేడి చేయకూడదు. వేడి  వేడి అన్నంలో పెరుగు వేసుకుని తినకూడదు. ఎందుకంటే వేడి తగలడం వల్ల అది దాని సహజమైన లక్షణాలని కోల్పోతుంది. కఫ దోషం ఎక్కువగా ఉన్నందున ఊబకాయం ఉన్నవాళ్ళు పెరుగుకు దూరంగా ఉండటం మంచిది. అంతే కాదు ఆయుర్వేదం ప్రకారం పండ్లతో కలపకూడదు. సమ్మర్ సీజన్ లో చాలా మంది చేసే తప్పు పెరుగు అన్నంలో మామిడి కాయ కలుపుకుని తింటారు. కానీ ఇది మంచి కలయిక కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

టాప్ హెడ్ లైన్స్

Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Raw Banana Fry : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
Bloating vs Belly Fat : పొట్ట ఉబ్బరమా? బెల్లీ ఫ్యాట్? తేడాలు ఇవే.. తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్
పొట్ట ఉబ్బరమా? బెల్లీ ఫ్యాట్? తేడాలు ఇవే.. తగ్గించుకునేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్
Dussehra Navratri Day 3 : దసరా నవరాత్రుల్లో మూడో రోజు నైవేద్యం.. శ్రీ అన్నపూర్ణా దేవికి పాయసం, దద్యోజనం చేసి పెట్టేయండి
దసరా నవరాత్రుల్లో మూడో రోజు నైవేద్యం.. శ్రీ అన్నపూర్ణా దేవికి పాయసం, దద్యోజనం చేసి పెట్టేయండి

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Embed widget