By: ABP Desam | Updated at : 29 May 2023 01:09 PM (IST)
Image Credit: Pixabay
రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. తాజాగా మరొక షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. డీమెన్షియా(చిత్త వైకల్యం) అభివృద్ది చెందే వాళ్ళు టైప్ డయాబెటిస్ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ జర్నల్ డయాబేటోలోజియాలో ఈ కొత్త పరిశోధన గురించి రాసుకొచ్చారు. చిత్త వైకల్యానికి, టైప్ 2 డయాబెటిస్ కి మధ్య సంబంధం ముడి పడి ఉందని వెల్లడించింది. ఒక వ్యక్తిలో డయాబెటిస్ రావడానికి ముందు డీమెన్షియా ప్రమాదం పెరుగుతుంది. ప్రీ డయాబెటిస్, చిత్త వైకల్యం మధ్య సంబంధం మీద పరిశోధన జరిపారు.
ప్రీడయాబెటిస్ అనేది టైప్ 2 డయాబెటిస్ రావడానికి ముందస్తు దశ. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కానీ టైప్ 2 డయాబెటిస్ స్థాయికి చేరుకోదు. చిన్న వయసులోనే మధుమేహం అనేది చిత్త వైకల్యానికి చాలా బలమైన సంబంధం కలిగి ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న నిపుణులు తెలిపారు.
1987-1989 సంవత్సరాల్లో యూఎస్ కి చెందిన 45-64 ఏళ్ల మధ్య వారి ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. ఈ పరిశోధనలో దాదాపు 11,656 మంది పాల్గొన్నారు. వారిలో 2,330(20 శాతం) మందికి ప్రీ డయాబెటిస్ ఉంది. షుగర్ వ్యాధి రావడానికి ముందు వారిలో చిత్తవైకల్యం కలిగి ఉన్నారని తేలింది. 60 ఏళ్ల లోపు మధుమేహాన్ని అభివృద్ధి చేసే వారికి చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం 3 రేట్లు పెరిగింది. ఇది 60-69 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిలో టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చేసే పరిమాణం పెరిగింది. ఇక 70-79 సంవత్సరాల మధ్య వారికి ఈ ప్రమాదం 23 శాతంగా ఉంది. ఇంక 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందటం వల్ల చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం కనిపించలేదు. అంటే కేవలం యువకుల్లోనే ఈ ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ప్రీ డయాబెటిస్ లేదా మధుమేహం రాకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటే డీమెన్షియా ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డీమెన్షియా అంటే ఇది ఒకరమైన మతిమరుపు కిందే చెప్పుకోవచ్చు. జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఆలోచన విధానంలో మార్పులు, ఏకాగ్రత లోపించడం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఇది ఒకరకంగా మానసిక వైకల్యం. ఒంటరిగా ఉండాలని అనిపించడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం, నిద్రలేమి, హెడ్ ఫోన్స్ లో అధికంగా వాల్యూమ్ పెట్టుకుని వినడం వంటి వాటి వల్ల మెదడు పనితీరుకి తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఫలితంగా పనితీరు క్షీణించి డీమెన్షియా అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Alzheimer's: మీకు అల్జీమర్స్ వస్తుందా - ఈ చిన్న పరీక్షతో గుర్తించొచ్చు!
Computer Vision Syndrome: కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా- ఈ టిప్స్ పాటించండి రిలీఫ్ పొందుతారు
Mineral Water: ఇంట్లోనే ఇలా సింపుల్ గా మినరల్ వాటర్ తయారు చేసేసుకోండి!
Fruits: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!
Garcinia Cambogia: బరువు తగ్గించుకునేందుకు ఈ పండు తినేస్తున్నారా- మరి సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసా!
Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ
Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కుస్తీ, ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్
IND vs AUS: మొహాలీని మోతెక్కించేదెవరు? - నేడే భారత్, ఆసీస్ తొలి వన్డే
/body>