అన్వేషించండి

Pregnancy Aging: ప్రెగ్నేన్సీతో త్వరగా వృద్ధాప్యం వస్తుందా? తాజా అధ్యాయనంలో ఏం తేలిందో తెలిస్తే షాకవుతారు

Pregnancy Aging: గర్భం దాల్చిన తర్వాత మీ వయస్సు వేగంగా పెరుగుతోందని మీరు భావిస్తున్నారా? మీరు అనుకునేది నిజమే కావచ్చు? ఎందుకంటే ఇదే విషయం ఇటీవలి పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.

Pregnancy  Aging: గర్భం దాల్చిన తర్వాత మీ వయస్సు వేగంగా పెరుగుతోందని మీరు భావిస్తున్నారా? మీరు అనుకునేది  నిజమే కావచ్చు? ఎందుకంటే ఇదే విషయం ఇటీవలి పరిశోధనలో వెలుగులోకి వచ్చింది.

గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. వారి బరువు పెరగడమే కాకుండా చర్మం, జుట్టు సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కొంటారు. అయితే గర్భం కూడా వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని మీకు తెలుసా? గర్భవతిగా ఉండటం వల్ల మీ జీవసంబంధమైన వయస్సు వేగంగా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భం దాల్చడం వల్ల మహిళల్లో వయసు త్వరగా పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రెగ్నెన్సీ కారణంగా మహిళల్లో వేగంగా వృద్ధాప్యం రావడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.

శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రచురించిన ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ, ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక నివేదికలో ఇప్పటికే గర్భం దాల్చిన స్త్రీలు జీవసంబంధమైన వృద్ధాప్య సంకేతాలను త్వరగా చూపవచ్చని పేర్కొంది. గర్భం దాల్చిన స్త్రీల వయస్సు ఇంకా గర్భం దాల్చని వారి కంటే వేగంగా పెరుగుతుందని తెలిపారు. 

గర్భం కూడా వ్యాధులకు కారణం కావచ్చు:

మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లోని కొలంబియా యూనివర్శిటీ ఏజింగ్ సెంటర్‌లో గర్భం.. దీర్ఘకాలిక ప్రభావాలను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త కాలెన్ ర్యాన్, గర్భధారణ మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చెప్పారు. గర్భం శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందన్నారు. ఈ ప్రభావాలు అన్నీ చెడ్డవి కానప్పటికీ, అవి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని, మరణాలను కూడా పెంచుతాయన్నారు. 

గర్భధారణ సమయంలో శరీరంలో మార్పులు:

అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ప్రకారం.. గర్భం దాల్చిన తొమ్మిది నెలల కాలంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. రొమ్ము పరిమాణం పెరగడం, రొమ్మును తాకినప్పుడు నొప్పి, గుండెల్లో మంట, అజీర్ణం, ఉదర కండరాలు ఒత్తిడి ఇలాంటి మార్పులు ఉంటాయి. ఇది కాకుండా, కాళ్ళలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్రాశయంపై ఒత్తిడి వంటి సమస్యలు కూడా వేధిస్తుంటాయి. 

అధ్యయనం ఎలా జరిగింది?

సెబు లాంగిట్యూడినల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే వివరాల ప్రకారం.. 2005లో అధ్యయనం ప్రారంభించినప్పుడు ఫిలిప్పీన్స్‌లోని 20, 22 సంవత్సరాల మధ్య వయస్సు గల 1,700 మంది మహిళల రక్త నమూనాలను విశ్లేషించారు. ఈ పరీక్షలో పాల్గొనే వారి గురించి కూడా ప్రశ్నలు అడిగారు. 'పునరుత్పత్తి , లైంగిక చరిత్ర', 'గర్భధారణల సంఖ్య' గురించి వారిని ప్రశ్నించారు. వృద్ధాప్యాన్ని ప్రభావితం చేసే కాలుష్యం, సామాజిక-ఆర్థిక కారకాలు కూడా సర్వేలో ఉన్నాయి.

శాస్త్రవేత్తల బృందం 2009, 2014 మధ్య స్త్రీ పాల్గొనే చిన్న సమూహం నుండి సేకరించిన డేటాతో ఫలితాలను సరిపోల్చింది. ఈ అధ్యయనం ప్రకారం, ఒకసారి తల్లులుగా మారిన మహిళలు, వారి జీవసంబంధమైన వయస్సు ఒక్కసారి కూడా గర్భం దాల్చని మహిళల కంటే వేగంగా పెరుగుతుందని తేలింది. దీని ప్రకారం, గర్భిణీ స్త్రీల సగటు వయస్సు ప్రతి సంవత్సరం పెరుగుతుందని వెల్లడించింది.

Also Read : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pushpa 2 Censor: పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
పుష్పరాజ్ రక్తపాతానికి సెన్సార్ కత్తెర... అల్లు అర్జున్ 'పుష్ప 2'లో డిలీట్ చేసిన సీన్స్ లిస్ట్ ఇదిగో
Crime News: 'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
'ఓరి నాయనో.. పోలీస్ డ్రోన్లు వచ్చేస్తున్నాయ్' - పొలాల్లో పరుగులు పెట్టిన మందుబాబులు
Embed widget