Lean Protein: ఈ లీన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నారంటే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది
కొవ్వు కరిగించి బరువు తగ్గేందుకు ఏవేవో ప్రయత్నాలు చేసి విసిగిపోయారా? అయితే ఈ లీన్ ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది.
మీరు బరువు తగ్గేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు తీసుకునే ప్రోటీన్ మీద ఫోకస్ పెట్టండి. అధిక ప్రోటీన్ డైట్ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఇది మీరు మొత్తం కేలరీలని తగ్గించేస్తుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆరోగ్య నిపుణులు లెక్కల ప్రకారం రోజువారీ కేలరీలో 25-30 శాతం ప్రోటీన్ నుంచి రావాలి. బరువు తగ్గేందుకు లీన్ ప్రోటీన్ తీసుకుంటే వేగంగా మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు.
అసలు లీన్ ప్రోటీన్ అంటే ఏంటి?
లీన్ ప్రోటీన్ అంటే సంతృప్త కొవ్వులో తక్కువగా ఉండే ప్రోటీన్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గేందుకు మాత్రమే కాదు గుండె ఆరోగ్యానికి మంచి చేస్తుంది. లీన్ ప్రోటీన్ దొరికే కొన్ని ఆహారాల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. మీ డైట్లో వీటిని చేర్చుకున్నారంటే త్వరగా బరువు తగ్గుతారు.
గుడ్లు
ప్రోటీన్ పుష్కలంగా లభించే పదార్థాలలో గుడ్డు మొదటిది. ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. వీటిలో లభించే ప్రోటీన్ శరీరంలో వేడి ప్రభావాన్ని పెంచుతుంది. దీని వల్ల జీవక్రియ వేగవంతం చేస్తుంది. అల్పాహారంలో గుడ్లు తినడం బరువు తగ్గేందుకు ఉత్తమ ఎంపికల్లో ఒకటి. ఆరోగ్యకరమైన అధిక మాంసకృతులు కలిగిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా చిరుతిండి తినాలనే కొరికలని తగ్గిస్తుంది. 2016 నివేదిక ప్రకారం అధిక ప్రోటీన్ అల్పాహారం తక్కువ బరువు, శరీర కొవ్వును తగ్గించడంలో ముడి పడి ఉంటుందని వెల్లడిస్తోంది.
పెరుగు
ఆవు పాల నుంచి వచ్చే పెరుగు చాలా మంచిది. ప్రోటీన్ రిచ్ పెరుగును అల్పాహారంగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఒక కప్పు పెరుగులో 15-20 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. అందులో గ్రనోలా, బెర్రీలు, చియా గింజలు, అరటి పండు, నట్స్, ప్రోటీన్ పౌడర్ జత చేస్తే మరీ మంచిది. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది.
చికెన్
లీన్ ప్రోటీన్ లభించే మరొక అద్భుతమైన పదార్థం చికెన్. ఇందులో లభించే కేలరీలు నేరుగా ప్రోటీన్ నుంచి వస్తాయి. బరువు తగ్గడానికి స్కిన్ లెస్, బోన్ లెస్, చికెన్ బ్రెస్ట్ తినడం ఉత్తమమైన ఎంపిక. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లో కేవలం 165 కేలరీలతో 31 గ్రాముల ప్రోటీన్ అందిస్తుంది. చికెన్ గ్రిల్ చేయడం ఆరోగ్యకరమైన మార్గం. అయితే వేయించిన లేదా ప్రాసెస్ చేసిన చికెన్ మాత్రం దూరం పెట్టండి.
సాల్మన్ చేపలు
సాల్మన్ వంటి కొవ్వు చేపలు శరీరానికి అవసరమైన ప్రోటీన్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులని ఇస్తాయి. వీటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ది సమృద్ధిగా లభిస్తుంది. ఇవి శరీరంలో వాపుని తగ్గించడంలో సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా బరువు తగ్గేందుకు దోహదపడతాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పప్పు ఉడికించేటప్పుడు నురుగు లాంటిది ఎందుకు వస్తుంది? అది హానికరమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial