Cardiac Arrest: ఆకస్మిక గుండె నొప్పి ఎలా వస్తుంది? ఆ ముప్పు నుంచి బయటపడేదెలా?
నడుస్తున్న వాళ్ళు, నిలబడిన వాళ్ళు, మనతో డాన్స్ చేసిన వాళ్ళు అప్పటికప్పుడు కుప్పకూలి చనిపోతున్నారు. కారణం కార్డియాక్ అరెస్టు. అసలు ఇది ఎలా వస్తుందనే విషయం చాలా మందికి తెలియదు..
అప్పటి వరకు మనతో మాట్లాడిన వాళ్ళు ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో వెంటనే ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ వార్తలు చదువుతూనే ఉంటున్నాం. అయితే అది గుండె పోటు కాదని కార్డియాక్ అరెస్టు అని చాలా తక్కువ మందికే తెలుస్తుంది.
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి, ప్రముఖ కన్నడ రేడియో జాకీ రచన కార్డియాక్ అరెస్టు బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే. కార్డియాక్ అరెస్టును చాలా మంది గుండె పోటుగా భావిస్తారు. గుండె పోటు, కార్డియాక్ అరెస్టు రావడానికి కారణాలు కూడా వేర్వేరుగానే ఉంటాయి. అకస్మాత్తుగా మరణిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది కార్డియక్ అరెస్టుతోనే చనిపోతున్నారు. ఇలాంటి మరణాలను వైద్యులు Sudden Cardiac Death (SCD) లేదా ఆకస్మిక గుండె నొప్పి మరణాలుగా పరిగణిస్తున్నారు.
గుండె కొట్టుకోవడం ఆకస్మికంగా ఆగిపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. ఇది తీవ్రమైన గుండె వైఫల్యంగా నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు లేదా ఇతరులు కూడా దీని బారిన పడే అవకాశం ఉండి. ఇటీవల కాలంలో చాలా మంది నిద్రలోనే మరణిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కారణంగా దాదాపు 95 శాతం కంటే ఎక్కువ మరణాలు సంభావిస్తున్నాయి. వీటిలో ఐదు శాతం కంటే తక్కువ కొన్ని మరణాలు బృహద్ధమని చీలిక కారణంగా కడుపు, ఛాతీ లేదా మెదడులో భారీగా రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. బృహద్ధమని చిలిపోవడానికి కారణం అనూరిజం.
అనూరిజం తెలుసుకోవడానికి పరీక్షలు?
అనూరిజం అనేది మెదడులోనే కాదు గుండెలోని సంభవిస్తుంది. అనూరిజం అంటే రక్తనాళంలో వాపు రావడం. రక్తనాళంలో బెలూన్ లేదా బుడగను ఏర్పరుస్తుంది. ఇది పగలకముందే చికిత్స ఆరంభించాలి. ఇది బాగా పెరిగి పగిలితే రక్తనాళాలు చిట్లి రక్తస్రావం అవుతుంది. అప్పుడు పరిస్థితి చేయిదాటి పోయి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలా బుడగ పగిలి పేలినప్పుడే చాలా మంది కుప్పకూలి చనిపోతారు. అనూరిజంను ఎక్స్-రే లేదా ఎకోకార్డియోగ్రఫీ ద్వారా తెలుసుకోవచ్చు. మెదడులో సాధారణ రక్త ప్రసరణ, ఆక్సిజన్ ప్రసరణకు అంతరాయం కలుగుతుంది.
కార్డియాక్ అరెస్టు కి కారకాలు
ధూమపానం, అధిక రక్తపోటు, అధిక రక్త కొలెస్ట్రాల్, ఊబకాయం, మధుమేహం, నిశ్చల జీవనశైలి వంటివి ఆకస్మిక మరణ ప్రమాదాన్ని పెంచే కొన్ని రకాల కారకాలు. ఈ విషయంలో మహిళల కంటే పురుషులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. కార్డియాక్ అరెస్టు జరిగిన వెంటనే విద్యుత్ షాక్ ఇవ్వడం లేదంటే సీపీఆర్ చేయడం చెయ్యాలి. లేదంటే రోగి ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే మరణిస్తాడు.
గుండె పోటు, కార్డియాక్ అరెస్టు మధ్య తేడాలు
ఇవి రెండు ఒకటే అని చాలా మంది అనుకుంటారు. కానీ రెండింటి లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. గుండె పోటు వచ్చిన వారికి కూడా కార్డియాక్ అరెస్టు జరిగే అవకాశం కూడా ఉండి. గుండెకు రక్త ప్రసరణ హ ఠాత్తుగా ఆగిపోయినా కూడా ఇది కలుగుతుంది. ముందు హార్ట్ ఎటాక్ వచ్చి చివరికి అది కార్డియాక్ అరెస్టుగా కూడా మారొచ్చు. రక్తంలో గడ్డకట్టడం కూడా దీనికి కారణం కావచ్చు. కార్డియాక్ అరెస్టు వచ్చాక బతికే ఛాన్సులు చాలా తక్కువ.
ఇక హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి మీద అవగాహన ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కరోనరీ రక్తనాళంలో క్లాట్లు ఏర్పడినప్పుడు రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. హార్ట్ ఎటాక్ వచ్చాక కూడా కొందరు రోగులకు స్పృహ ఉంటుంది. గుండెల్లో తీవ్రమైన నొప్పిగా అనిపిస్తుంది. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఒక్కోసారి గ్యాస్ సమస్య ఎక్కువగా మారి ఆ గ్యాస్ గుండెకి కొట్టినప్పుడు కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదురు కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గుండె పదిలంగా ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ గుండెని రక్షించుకోవాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే
Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!