News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dreams: కాళ్లను పట్టుకున్నట్లు కల వచ్చిందా? అయితే, జరిగేది ఇదే!

కలలో మనం ఎవరివైనా పాదాలు తాకినట్టు కనిపిస్తే దానికి ఎలాంటి అర్థం ఉంది? ఎందుకు మనకు అలాంటి కల వచ్చింది? ఇక్కడ తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

లలు జీవితంలో భాగం. అయితే కలలో ఏది కనిపించినా దానికి ఒక కారణం ఉంటుంది. కొన్ని సార్లు భవిష్యత్తులో జరిగేవి తెలిపేవిగా ఉంటాయి. కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలకు మనకు తెలియని సమాధానాలుగా ఉంటాయి. సనాతన ధర్మంలో పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడం వెనుక చాలా లోతైన అర్థం ఉంటుంది. అయితే కలలకు తప్పక ఏదో కారణం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఏ కల ఏ  కారణంతో  వచ్చిందో కూడా విశ్లేషిస్తుంది. అలాంటి విశ్లేషణలో కలలో ఎవరివైనా పాదాలు తాకినట్టుగా కనిపిస్తే అర్థం ఏమిటో తెలుసుకుందాం. 

ఎవరి పాదాలైనా తాకి ఆశీర్వాదం తీసుకున్నట్టు కల వస్తే తప్పక దానికి ఒక కారణం లేదా సూచన ఉంటుందని శాస్త్రం చెబుతోంది. పాదాలు తాకి నపుడు కచ్చితంగా కొంత శక్తి వినిమయం జరుగుతుంది. పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్న కల వస్తే ఏన్నో ఆశీర్వాదాలు మీ వెన్నట్టి వస్తున్నాయని అనేందుకు సూచన.  

  • పెద్దవారి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నట్టు కలలో కనిపిస్తే త్వరలో మీరు ఒక అభివృద్ధి పథంలోకి అడుగుపెట్ట బోతున్నారని అర్థం.
  • ఎవరి కాళ్లకు దణ్ణం పెడుతున్నారో స్పష్టత లేకుండా కల ఉంటే మీకు గ్రహచారం అనుకూలించబోతోందని అర్థం.
  • సీనియర్ పాదాలు తాకినట్టు కనిపిస్తే మీలోని వినయం బయటపడబోతుందని అర్థం. మీలో ఏదో ఒక విషయంలో జ్ఞానం పొందబోతున్నారని అర్థం. మీలో మరింత శక్తి జనించబోతోందనేందుకు సూచన కావచ్చు.
  • ఒకరి పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడం అంటే జీవితంలో తెలియకుండా ఉన్న చీకటిని పారద్రోలే శక్తికి నిదర్శనం. ఇది జీవితంలోకి అదృష్టాన్ని తేవచ్చు. బలాన్ని ఇవ్వొచ్చు, జ్ఞానం అందించవచ్చు లేదా కీర్తి ప్రతిష్టలు పొందవచ్చు.
  • ఒక్కోసారి వేరే వాళ్ల పాదాలు తాకడం అనేది తప్పులు సరిదిద్దుకోవడానికి ఇంకా సమయం ఉందని అర్థం. తప్పులు సరిదిద్దుకునేందుకు మీరు వర్కవుట్ చెయ్యాలనే సూచన కావచ్చు. నమ్మనా నమ్మకపోయినా మీరు సంతోషంగా ఉండేందుకు ఇలా తప్పులు దిద్దుకోవడమే చక్కని దారి.
  • ఎవరినైనా తాకినట్టు కలవస్తే మీరు పనిచేసే చోట మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం తప్ప మరో దారిలేదని అర్థం. ప్రేమ మీ దారిలో ఎదురవుతున్నప్పటికీ మీరు పట్టించుకోకపోవడం ద్వారా మీరు దాన్ని దాటి పోవచ్చు.
  • కలలో పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకోవడం అభివృద్ధి నిచ్చెన ఎక్కి ముందుకు వెళ్లి పోయ్యే అవకాశం ఉందని అర్థం. మీ ముందున్న అవకాశాల విషయంలో మీరు డోలాయమాన స్థితిలో ఉన్నారనేందుకు కూడా ఇది సూచన కావచ్చు.

Also read : శ్రావణ మాసంలో పుట్టినవారు ఎందుకంత ప్రత్యేకం? వారి జీవితం ఎలా ఉంటుంది?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

Published at : 30 Jun 2023 05:00 AM (IST) Tags: dream dreams meaning touching feet in dream Dreams Reason

ఇవి కూడా చూడండి

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Hyperacidity: హైపర్ అసిడిటీని తగ్గించే ఆయుర్వేద ఆహార పదార్థాలు ఇవే

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Pea Protein Powder: బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అన్నీ లాభాలున్నాయా?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Relatioships: నా భర్త ఆమెతో మళ్లీ మాట్లాడుతున్నాడు, నాకు నచ్చడం లేదు - ఏం చేయమంటారు?

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

Teenagers: తల్లిదండ్రులూ జాగ్రత్త, టీనేజర్లలో పెరిగిపోతున్న డిప్రెషన్ లక్షణాలు

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Breaking News Live Telugu Updates: రింగ్‌ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం

Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Telangana BJP :  సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు-  చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్