అన్వేషించండి
Advertisement
శ్రావణ మాసంలో పుట్టినవారు ఎందుకంత ప్రత్యేకం? వారి జీవితం ఎలా ఉంటుంది?
శ్రావణంలో పార్వతి సమేతంగా ఈ భూమిమీద శివుడు తిరగాడుతాడని శాస్త్రం చెబుతోంది. శ్రావణంలో శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసి పోతాయి. అంతేకాదు ఈ నెలలో పుట్టిన వారికి ప్రత్యేకంగా శివుడి ఆశీర్వాదాలు ఉంటాయట.
శ్రావణం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. ఇది ప్రతి ఏటా జూలై, ఆగష్టు మాసాల్లో వస్తుంది. ఈ మాసం శివారాధనకు, లక్ష్మీ పూజలకు ప్రాశస్థ్యమైన మాసంగా శాస్త్రం చెబుతోంది. శ్రావణంలో పుట్టిన వారి భవిష్యత్తు చాలా బావుంటుందని నమ్మకం.
శ్రావణ మాసంలో శివుని ఆరాధించడం ద్వారా ఆయన కరుణా కటాక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు. బోళా శంకరుడిగా ప్రసిద్ధి గాంచిన శివుడి ఆరాధన శ్రావన మాసంలో చేసుకున్న వారికి తప్పకుండా కష్టాలు తీరుతాయి.
జ్యోతిష్య శాస్త్రంలో పుట్టిన నెలను బట్టి కూడా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడం సాధ్యపడుతుంది. అలా శ్రావణంలో పుట్టిన వారు ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉంటారని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు.
- శ్రావణంలో పుట్టిన వారు పవిత్రమైన మనసు కలిగి ఉంటారు. వీరిది ప్రేమతో నిండిన హృదయం. వారిని ప్రేమించే వారికి తిరిగి ఇచ్చే ప్రేమ కూడా చాలా అవధులు లేనంతగా ఉంటుంది. అంతేకాదు వీరు శివుడి లాగే చాలా మౌనంగా ఉండే మనుషులు. అంతేకాదు కోపం వస్తే మాత్రం భరించడం చాలా కష్టంగా మారుతుంది. శివుడి రౌద్ర రూపం లాగే అదుపు చెయ్యడం అంత సులభం కాదు.
- మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి వీరికి. ఏదైనా పని చెయ్యాలని నిర్ణయించుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు.
- ఈ నెలలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు కూడా. ఎందుకంటే వీరి మీద ఎల్లప్పుడు ఆ పరమశివుడి ఆశిస్సులు ఉంటాయి.
- మనసులో ఎలాంటి కపటం లేని వీరు చాలా సార్లు మనసుతో నిర్ణయాలు చేస్తుంటారు. ఎమోషనల్ గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా సార్లు వారి నిర్ణయాలు, అంచనాలు తప్పుతుంటాయి కూడా. తప్పుడు నిర్ణయాల వల్ల కష్టాల పాలు కూడా అవుతుంటారు.
- సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చాలా నిజాయితిగా ఉంటారు. వీరు అంత త్వరగా ఎలాంటి సంబంధబాంధవ్యాలు ఏర్పరుచుకోరు వీళ్లు. ఒకవేళ కమీట్ అయితే మాత్రం ఇక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. భాగస్వామి పట్ల విపరీతమైన ప్రేమ బాధ్యతతో వ్యవహరిస్తారు.
- శ్రావణ మాసంలో పుట్టిన వారు వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. శివుడి ఆశిస్సులతో వీరికి పెద్దగా ఆర్థిక కష్టాలు రావు. జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు వీరి దరికి రావు. చాలా వరకు జీవితం ఆనందంగా సాగుతుంది.
- మొత్తంగా చెప్పాలంటే శ్రావణ మాసంలో పుట్టిన వారు శివుడికి చాలా ప్రీతిపాత్రులుగా ఉంటారు. అచ్చం శివుడి వంటి వ్యక్తిత్వం కలవారై ఉంటారు. ఆపన్నులకు తప్పక సాయం చేస్తారు. అందుకు వారికి కొంత కష్టం ఎదురైనా దాన్ని కూడా ఎదుర్కుంటారు తప్పా వెనక్కి పోరని చెప్పవచ్చు. మంచి మనసున్న వారిగా జీవితంలో విజయం సాధిస్తారు.
Also read : Ravana Ten Heads: రావణాసురుడికి పది తలలు ఎందుకు ఉంటాయి? అది ఎవరి వరం?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా రివ్యూ
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion