అన్వేషించండి

Ravana Ten Heads: రావణాసురుడికి పది తలలు ఎందుకు ఉంటాయి? అది ఎవరి వరం?

రావణుడికి ఉన్న పది తలలను రావణాసురుడి తెలివి తేటలు పాండిత్యానికి ప్రతీకగా కొంత మంది విశ్లేషించినప్పటికీ నిజానికి పదితలలు అతడి వ్యక్తిత్వానికి ప్రతీకలు.

రావణాసురుడు రాక్షస కుటుంబానికి చెందిన అసుర దంపతులైన విశ్రవసు, కైకేసిల కుమారుడు. అందుకే ఆయన్ని రాక్షసరాజు అని అంటారు. రాక్షసుల కులదైవమయిన శివునికి మహా భక్తుడు. నిరంతరం శివారాధన చేయడం ఆయన ధర్మం. అనేక సార్లు మహా శివుని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుని గొప్ప వరాలు పొందిన తపస్సంపన్నుడు.

మహా పండితుడు

రావణుడు గొప్ప సంగీత విద్వాంసుడు. వీణావాయిద్యంలో ఆరితేరిన వాడు. మొత్తం షడ్సాస్త్రాలు అవపోసన పట్టిన వాడు. నాలుగు వేదాలు చదువుకున్న చతుర్వేది. 64 కళల్లో ప్రవేశం కలిగిన అత్యంత జ్ఞానవంతుడు. మహా పండితుడైన బ్రాహ్మణుడు. తపస్సశ్శక్తి కలిగిన వాడు. అందువల్లే అతడు రావణ బ్రహ్మగా పేరుగాంచాడు. అతడితో పొరాడి గెలవగలిగే వారు 14 లోకాల్లోనూ ఎవరూలేరని ప్రతీతి. రావణుడు ఎన్నో గ్రంథాలు కూడా రచించాడని చెబుతారు. సామవేదంలోని ఏడు స్వరాలను సంకలనం చేశాడు. ఇప్పటికీ అందరూ పాడుకునే శివతాండవ స్తోత్రాన్ని స్వరపరచింది రావణాసురుడే.

రావణుడికి 10 తలలు ఎలా వచ్చాయి?

ఒకసారి కఠోర శివ దీక్షలో భాగంగా శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు హోమ గుండంలో తన తలను తానే నరికి త్యాగం చేశాడు. అతడి తపశ్శక్తి వల్ల అతడి తల తిరిగి యథా స్థానానికి వచ్చింది. అలా పది సార్లు తన తలను నరికి శివుడి ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. అతడి త్యాగానికి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఆ సందర్భంలో అతడికి పదితలలను, ఇరవై చేతులను ప్రసాదించాడు. అది అతను కోరుకున్నప్పుడల్లా వచ్చేలా వరం ఇచ్చాడు. అందుకే రావణుడు దశముఖుడు, దశకంఠుడు, దశగ్రీవుడు అనే పేర్లతో ప్రసిద్ధికెక్కాడు.

విచిత్ర రామాయణం ద్వారా మరో కథ కూడా ప్రచారంలో ఉంది. వశ్రవసు దాంపత్య సుఖాన్ని ఆశించి కైకసిని చేరిన సందర్భంలో ఆమె అప్పటికే పది సార్లు రుతుమతి అయిందని తెలుసుకుంటాడు. అందుకే ఆమె ద్వారా పదకొండు మంది పుత్రులు కావాలని కోరుకుంటాడు. కానీ కైకసి మాత్రం తనకు ఇద్దరు కుమారులు మాత్రం చాలని అంటుంది. మహా తపస్సంపన్నుడైన విశ్రవసు మాట వృథా కాకూడదు కనుక పది తలలు కలిగిన రావణుడితో పాటు కుంభకర్ణుడిని కుమారులుగా ప్రసాదించాడని మరో కథ.

వాల్మీకీ రామాయణంలో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. రావణుడికి తెలిసిన కామరూప విద్య ద్వారా రావణుడు పది తలలను పొందాడని కూడా మరో కథ ఉంటుంది. ఆ ప్రకారం అతడు ఎప్పుడు కోరితే అప్పుడు పది తలలు ఇరవై చేతులు వస్తాయి. ఇలా పది ఇంద్రియాలకు లొంగిపోయిన వాడే దశకంఠుడు అని పురాణ పండితులు  విశ్లేషిస్తున్నారు.

10 తలలు దేనికి ప్రతీక?

రావణుడికి ఉన్న పది తలలను రావణాసురుడి తెలివి తేటలు పాండిత్యానికి ప్రతీకగా కొంత మంది విశ్లేషించినప్పటికీ.. నిజానికి పదితలలు అతడి వ్యక్తిత్వానికి ప్రతీకలు. కామం, క్రోదం, లోభం, మోహం. మదము, మాత్సర్యము, అహంకారం, చిత్త, మానస, బుద్ధి వీటన్నింటికీ ప్రతిబింబిస్తాయి. అతడి వ్యక్తిత్వంలో భాగమైన అతడి పూర్తి శక్తి, యుక్తులను అతడి పది తలలు ప్రతీకలుగా చెప్పవచ్చు.

Also read : ఎంతో ప్రేమించిన రాధను కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 4 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - నేడు మీ అదృష్టం ఎలా?
నవంబర్ 4 రాశిఫలాలు: ధనుస్సు, మకరం, కుంభం, మీనం - నేడు మీ అదృష్టం ఎలా?
నవంబర్ 4 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులు ఎవరికి ధనలాభం, ఎవరికి జాగ్రత్త!
నవంబర్ 4 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులు ఎవరికి ధనలాభం, ఎవరికి జాగ్రత్త!
నవంబర్ 4, 2026 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారి జీవితంలో కీలక మార్పులు!
నవంబర్ 4, 2026 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారి జీవితంలో కీలక మార్పులు!
దీపావళి లక్ష్మీ పాదాలు: ఇంట్లోకి సంపద రావాలంటే ఏ దిశలో, ఎక్కడ వేయాలి?
దీపావళి లక్ష్మీ పాదాలు: ఇంట్లోకి సంపద రావాలంటే ఏ దిశలో, ఎక్కడ వేయాలి?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget