అన్వేషించండి

ఎంతో ప్రేమించిన రాధను కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ రాధాకృష్ణుల పెళ్లి జరగలేదు. కనుక వారి ప్రేమ ఎంత పవిత్రమో అంత వివాదస్పదంగా కూడా మిగిలిపోయింది.

ప్రేమకు ప్రతిరూపాలుగా రాధాకృష్ణులను భావిస్తారు. ప్రేమ దేవతలుగా ప్రపంచవ్యాప్తంగా పూజలందుకునే జంట. వారి ప్రేమ కథ ఒక అజరామరం. కానీ వారికి పెళ్లి జరగలేదు. ఈ ఒక్క కారణంతో వారి ప్రేమను, వారి ప్రేమను ఆరాధించే వారిని కూడా కొంత ఇబ్బంది పెడుతుంది కూడా. కృష్ణుడికి ఎంతో మంది భార్యలున్నా సరే ఆత్మ మాత్రం రాధదే. అత్యంత దైవికమైన ప్రేమగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ భూమి ఉన్నంత కాలం వారి ప్రేమ నిలిచి ఉంటుంది. రాధాకృష్ణులను ఆరాధించే వారికి వారు పెళ్లి చేసుకోకపోవడం బాధించే విషయమే. ఎన్నో కథలు ఈ విషయంగా ప్రచారంలో కూడా ఉన్నాయి.

పురాణాలు ఏం చెబుతున్నాయి

వీర్జతో కలిసి ఉన్న శ్రీకృష్ణుడిని చూసి రాధ దుర్భాషలాడడం వల్ల వీర్జ మనసు కష్టపెట్టుకుని నదిగా మారిందని ఒక కథ. తర్వాత రాధ కూడా కృష్ణుడికి దగ్గరయ్యేందుకు నిరాకరించిదని, కృష్ణుడికి అత్యంత ప్రియమైన మిత్రుడు సుధాముడు రాధకు నచ్చజెప్ప చూసినప్పుడు అతడిని కూడా రాధ దుర్భాషలాడిందని అప్పుడు సుధాముడు రాధను ఈ జన్మలోనే కాదు.. మరు జన్మలో కూడా మనసు కోరిన వరుడిని పెళ్లి చేసుకోలేవని శపించినట్టు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. కంససంహారం కోసం కృష్ణుడు గోకులం వదిలి మధురకు వెళ్లిపోవాల్సి వచ్చింది. వారి ప్రేమకు ఇలా అవాంతరాలెన్నో ఉన్నాయి.

రాధను లక్ష్మీ అంశగా కూడా భావిస్తారు. అవతారం చాలించిన తర్వాత తిరిగి వైకుంఠం చేరుకుందని నమ్ముతారు. పెళ్లి చేసుకుందామని అన్న కృష్ణ ప్రతిపాదనను రాధ తిరస్కరించినట్టు కూడా కొన్ని కథలు ప్రాచూర్యంలో ఉన్నాయి.

పవిత్ర ప్రేమ

రాధ, కృష్ణులు పెళ్లి చేసుకోక పోవడం వెనుక ఒక పవిత్ర లక్ష్యం ఉంది. శ్రీకృష్ణుడు లోకకల్యాణార్థం అవతరించిన విష్ణు అవతారం. దుష్ణ శిక్షణకు శిష్ట రక్షణకు భువి కి దిగి వచ్చిన దైవస్వరూపం. ధర్మ పరిరక్షణ అతడి అవతార లక్ష్యం. మానవళికి సరైన మార్గదర్శనం చెయ్యటం కోసం అవతరించాడు. రాధతో పవిత్ర ప్రేమ, పెళ్లి ఆయనను తన లక్ష్యం నుంచి దారి మళ్లించే ప్రమాదం ఉందని భావించడం వల్ల వారి పెళ్లి జరగలేదు.

ఆనాటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా రాధా కృష్ణుల ఇద్దరి జీవితాల మధ్య సాంస్కృతిక విబేధాలు చాలా ఉన్నాయి. రాధా, కృష్ణులు ఇద్దరు కూడా వేర్వేరు సామాజిక స్థితులకు చెందిన వారు. రాధ ఒక చిన్న గ్రామానికి చెందిన గొల్ల పిల్ల. కృష్ణుడు మధుర రాజ్యానికి రాజకుమారుడు. తర్వాత కాలం రాజు కూడా. వారి కలయికకు ఈ సామాజిక తేడాలు కూడా కారణం అవుతున్నాయి. ఆ రోజుల్లో సామాజిక నియమాలకు ఈ పెళ్లి అంగీకారయోగ్యం కాదు. అందుకే కృష్ణుడిపై ప్రేమను దాచి, కఠినంగా ప్రవర్తించి దూరం చేసుకుందని చెబుతారు.

Also read : చిన్న లవంగ పరిహారంతో పెద్ద సమస్యలకు పరిష్కారం

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.

టాప్ హెడ్ లైన్స్

2026లో హరియాళి తీజ్, ఆగస్టు 15 సేల్స్: డబుల్ షాపింగ్ ధమాకా! వివాహిత మహిళలు ఏం కొనాలి?
2026లో హరియాళి తీజ్, ఆగస్టు 15 సేల్స్: డబుల్ షాపింగ్ ధమాకా! వివాహిత మహిళలు ఏం కొనాలి?
Shani Vakri 2026: శని వక్రగమనం - కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
శని వక్రగమనం: కెరీర్, సంబంధాలపై నిజ స్వరూపం! ఏ రాశులు జాగ్రత్త పడాలి?
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
CJP సపోర్ట్‌తో జార్ఖండ్ యువజన ఉద్యమం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఉద్యమంపై జ్యోతిష్య అంచనాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!
నాగ పంచమి 2026: పెనం ముట్టుకుంటే రాహు దోషం, ఆర్థిక కష్టాలు!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget