Snakes in Dream: పాములు ఇలా కల్లోకి వస్తే ఆ కోరికలు ఎక్కువట, మరి కాటేసినట్లు కనిపిస్తే?
మీకు ఎప్పుడైనా పాములు కల్లోకి వచ్చాయా? ఎలాంటి కలలు వచ్చాయి? అయితే, ఒక్కో కలకు ఒక్కో కారణం ఉంటుందట.
టీవీ లేదా ఓటీటీల్లో ‘అనకొండ’, ‘స్నేక్స్ ఆన్ ఎ ప్లేన్’ వంటి సినిమాలు చూసి నిద్రపోయినప్పుడు.. మీ కలలో తప్పకుండా పాములు కనిపిస్తాయి. దీంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. అయితే, కొందరికి అలాంటి సినిమాలేవీ చూడకుండానే పాములు కల్లోకి వస్తుంటాయి. శరీరంపై పాకుతున్నట్లు, కాటేస్తున్నట్లు.. ఇంకా చాలా రకాలుగా కలలో కనిపిస్తుంటాయి. అయితే, అది జస్ట్ డ్రీమే కాదా అని కొట్టిపడేయకండి. పాములు ఇలా కనిపించడం వెనుక చాలా కారణాలుంటాయనేది మన పూర్వికుల నమ్మకం. మరి, పాములు ఎన్నిరకాలుగా కలలోకి వస్తాయి? ఆ కలలు వేటిని సూచిస్తాయో చూసేద్దామా.
సాధారణంగా పాము అనే పదం వినగానే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది అది కల్లోకి వచ్చిందంటే చెమటలు పట్టేస్తాయి. కొందరు గట్టిగా కేకలు పెట్టి నిద్రలేచిపోతారు. అయితే, పాములు కలలోకి రావడం సర్వసాధారణం.
పాములు ప్రత్యక్షమైతే: పాములు సాధారణంగా కలలోకి వస్తే మంచిదేనని మన పూర్వికుల నమ్మకం. అప్పట్లో పాములను పురోగతికి సంకేతాలుగా భావించేవారు. పాములు కల్లోకి వస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగుతారని అర్థమని భావించేవారు.
పాము కాటేసినట్లు లేదా మింగేస్తున్నట్లు కల వస్తే?: పాము మిమ్మల్ని కాటేస్తున్నట్లు కల వచ్చినట్లయితే.. అది మీ జీవితంలో ఏదైనా ఒకటి వదిలేయాలని సూచిస్తుంది. అది ఇతరులతో సంబంధం కావచ్చు, ప్రియమైన వ్యక్తిని కావచ్చు లేదా ఏదైనా వస్తువుని కావచ్చు. లేదా అవి వాటికవే మీకు దూరం కావచ్చు.
పాములు బెడ్ మీద కనిపిస్తే?: స్నేక్ డ్రీమ్స్ ఫ్రూడియన్ అనాలసిస్ ప్రకారం.. కొన్ని కలల్లో పాములు పురుషులకు ప్రతీక. మహిళలకు పాములు మంచం మీద కదులుతున్నట్లు కలలోకి రావడం.. లైంగిక శక్తిని సూచిస్తాయి. అంటే వారికి భవిష్యత్తులో ఒక రొమాంటిక్ అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం. లైంగిక కోరికలు, సాన్నిహిత్యం, గోప్యతా భావనను పాములు తెలియజేస్తాయి. అంతేకాదు, మీరు విశ్రాంతి తీసుకోవాలని కూడా ఆ కలలు సూచిస్తాయి.
పాములు కల్లోకి రావడం ఒక హెచ్చరిక కూడా: పాములు విషాన్ని సూచిస్తాయి. అంటే, పాములు కల్లోకి వచ్చాయంటే.. మీకు ఎవరితోనే కీడు ఉందనే అర్థం. పాము కల్లోకి వచ్చిందంటే.. మీరు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని అర్థం. అలాగే, మీరు ఒక పని చేయడం వల్ల నష్టం వస్తుందని తెలిసినా.. అతి విశ్వాసంతో ముందుకు వెళ్లడం మంచిది కాదని సూచిస్తుంది. అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారని పాము కల సూచిస్తుందని పెద్దలు భావించేవారు.
పాములను మీరు ఇష్టపడతారా? ద్వేషిస్తారా?: పాముల గురించి మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా కలల ఫలితాలు ఉంటాయట. పాములను మీరు దైవంగా లేదా సాంస్కృతిక నమ్మకాలుగా భావిస్తే.. అవి కలలోకి వచ్చినా ఆందోళన అక్కర్లేదు. ఒక వేళ మీరు పాములను ద్వేషిస్తున్నా, భయపడుతున్నా.. కలల ఫలితం వేరేగా ఉంటుందట. అలాగే పాములను పెంపుడు జంతువులుగా పెంచుకొనేవారికి.. ఈ కలలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వవట. ఏది ఏమైనా.. ఒక్కొక్కరికీ ఒక్కో నమ్మకం. కొందరు వాటిని నమ్మతారు. మరికొందరు అవన్నీ మూఢ నమ్మకాలని కొట్టిపడేస్తారు.
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!
గమనిక: మన సమాజంలో ఉన్న కొన్ని విశ్వాసాలను తెలియజేయడానికి మాత్రమే కథనాన్ని అందించాం. మూఢ నమ్మకాలను ప్రోత్సహించేందుకు కాదని గమనించగలరు.