News
News
X

Ice Water Facial: కొరియా చిట్కా - ఐస్ నీళ్లలో ముఖం పెడితే అన్ని ప్రయోజనాలా? మీరు అస్సలు నమ్మలేరు!

ఐస్ ముక్కలు కాసేపు పట్టుకోవాలంటేనే అల్లాడిపోతాం. మరి అలాంటిది ఏకంగా ఐస్ ముక్కలు వేసిన నీటితో ముఖాన్ని నానబెడితే ఎలా ఉంటుందంటారు. వామ్మో అనిపిస్తుందా. కానీ ఇది మీ చర్మ సంరక్షణకు చాలా మంచిదండోయ్.

FOLLOW US: 

ర్మ సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే అనేక రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు. చర్మం శుభ్రంగా ఉన్నప్పుడే మనం వాడే సౌందర్య ఉత్పత్తులు మన చర్మానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. మృదువైన ముఖం కోసం హాట్ స్ట్రీమ్ ఫేషియల్ ని చేయించుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మరో కొత్త పద్ధతి వచ్చేసింది. అదే ఐస్ వాటర్ తో ఫేషియల్ చేసుకోవడం. కొరియా ప్రజలు అంత అందంగా ఉండటానికి కారణం ఈ చిట్కానే. ఒక ఐస్ ముక్క రెండు నిమిషాలు పట్టుకోవడానికే అల్లాడి పోతారు. అలాంటిది చల్లని  నీటిలో ముఖాన్ని నానబెడితే ఎలా ఉంటుందంటారు? వామ్మో అనిపిస్తుంది కదా. కానీ ఈ కొత్త రకం పద్ధతి చాలా మందికి నచ్చేసింది. 

ఇది మీ ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకుని అందులో కొన్ని చల్లటి నీళ్ళు వాటితో పాటు ఐస్ ముక్కలు వేసుకోవాలి. ఆ గిన్నెలో మీ ముఖాన్ని ముంచి 30 సెకండ్ల పాటు ఉంచాలి. ముఖాన్ని బయటకి తీసిన తర్వాత మెత్తగా ఉండే టవల్ తో తుడుచుకోవాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేసుకోవాలి. 

ఇది నిజంగా పనిచేస్తుందా?

ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. కానీ ఐస్ వాటర్ లో ముఖాన్ని పెట్టి శుభ్రం చేసుకోవడం వల్ల చిరాకు పోతుంది. మొటిమలతో బాధపడుతున్నా, ఫేస్ మీద దద్దుర్లుతో ఇబ్బంది పడుతున్నా మీ ముఖాన్ని ఐస్ వాటర్లో కాసేపు నానబెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ ముఖం వాసి ఇబ్బంది పెడుతున్నా ఈ పద్ధతి ప్రకారం ఐస్ వాటర్ లో పెట్టడం వల్ల అది తగ్గిపోతుంది. ఇది మీ చర్మం మరింత అందంగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా పాటించడం వల్ల మీరు అద్భుతాలు చూడవచ్చు. 

ఐస్ వాటర్లో ముఖాన్ని నానబెట్టడం వల్ల ప్రయోజనాలు 

  • మీ ముఖం నిస్తేజంగా ఉంటే చల్లటి ఐస్ వాటర్ లో నానబెట్టుకోవడం వల్ల చర్మానికి ఇది తక్షణ మెరుపునిస్తుంది. రక్త సరఫరా బాగా జరిగి చర్మ కణాలకి ఆక్సిజెన్ అందిస్తుంది. దాని వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. 
  • చల్లటి నీరు ముఖంలోని రంధ్రాలను బిగుతుగా ఉండేలా చేస్తుంది. చర్మం సాగిపోయేతత్వాన్ని ఆపుతుంది. ముఖంపై ముడతలు రాకుండా చూస్తుంది. దీని వల్ల మీరు యవ్వనంగా ఉండటమే కాదు వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుంది. 
  • మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. చాలా మందికి మేకప్ వేసుకున్న కొన్ని గంటల తర్వాత ముఖంపై జిడ్డు ఏర్పడుతుంది. దీనివల్ల మేకప్ త్వరగా పోవడం జరుగుతుంది. ఐస్ వాటర్ తో శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంలో వచ్చే జిడ్డు లాంటి నూనెని తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలు మూసుకుపోయే విధంగా చేస్తుంది. దాంతో మేకప్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంటుంది. 
  • ముఖం మీద మొటిమలు, దద్దుర్లు ఉన్నా, ఎర్రబడి చికాకు పెడుతున్నా ఈ ఐస్ వాటర్ మెథడ్ అద్భుతంగా పని చేస్తుంది. వేడి నీటి కంటే చన్నీళ్ళు ముఖాన్ని శాంతపరుస్తాయి. థ్రెడ్డింగ్ లేదా షేవింగ్ చేసిన తర్వాత ఐస్ వాటర్లో ముఖం పెడితే హాయిగా ఉండటంతో పాటు వాటి వల్ల వచ్చే మంట నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడ ఈ ఐస్ వాటర్ తో ముఖం నానబెట్టుకుని చూడండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చెమట పడితే నిజంగానే బరువు తగ్గుతారా? ఇది వాస్తవమా లేక అపోహ

Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!

Published at : 23 Jul 2022 02:01 PM (IST) Tags: Skin Care Tips Glowing Skin Tips Ice Water Face Wash Ice Water Stream Ice Water Facial

సంబంధిత కథనాలు

Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?

Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!

టాప్ స్టోరీస్

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

AP News: టీచర్లకే కాదు ఉద్యోగులందరికీ ఫేస్ అటెండెన్స్ - మంత్రి బొత్స కీలక ప్రకటన !

Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Harish Rao :  అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ?  -  షెకావత్‌కు హరీష్ కౌంటర్ !

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు