ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
లేటు వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవల్సిందే. ఇప్పుడే అప్రమత్తం కాకపోతే.. పెళ్లి చేసుకున్న తర్వాత ఎలాంటి ఫలితం ఉండదు.
వయస్సు పెరిగే కొద్ది పురుషుల్లో క్రమేనా శరీరక శక్తి క్షీణిస్తుంది. అంతేకాదు.. సెక్స్ సామర్థ్యం కూడా క్రమేనా తగ్గిపోతుంది. కొంతమంది పురుషుల్లో సంతాన సమస్యలు కూడా పెరుగుతాయి. అయితే, ఏ వయస్సు వరకు సెక్స్ సామర్థ్యం ఉంటుందనే విషయంపై స్పష్టత లేకున్నా.. ప్రపంచవ్యాప్తంగా జరిపిన కొన్ని పరిశోధనలు, అధ్యయనాల ప్రకారం.. ఒక నిర్దిష్ట వయస్సును తెలుసుకున్నారు. ఆ వయస్సు నుంచే పురుషుల్లో క్రమేనా లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం మొదలవుతుందని పేర్కొన్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే.. 70 ఏళ్ల వయస్సు వరకు ఛాంపియన్స్‌గా సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చట. ఇంతకీ పురుషులు ఏ వయస్సు నుంచి తమ లైంగిక సామర్థ్యంపై దృష్టి పెట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లైంగిక కోరికలు వేరు.. లైంగిక సమస్యలు వేరు. ఎందుకంటే.. చాలామంది పురుషుల్లో 70 ఏళ్ల వరకు లైంగిక కోరికలు ఉంటాయట. కానీ, సెక్స్ సమయంలో మాత్రం డకౌట్ అవుతారట. అంటే, వయస్సు మీదపడటం వల్ల లైంగిక శక్తి కూడా క్షీణించి పోతుంది. అయితే, అది అకస్మాత్తుగా తగ్గిపోదు. యుక్త వయస్సు నుంచే మొదలవుతుంది. ఆ ట్రిగర్ పాయింట్‌ను మీరు తెలుసుకుంటే.. ముందు జాగ్రత్తతో భవిష్యత్తులో జరగబోయే నష్టాన్ని అడ్డుకోవచ్చు.
సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది?: లైంగిక సామర్థ్యం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. డిప్రెషన్, ఒత్తిడి, మద్యపానం, డ్రగ్స్, అనారోగ్యాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ‘ఎండోక్రైన్’ అనే డిజార్డర్ వల్ల కూడా పురుషుల్లో సెక్స్ హార్మోన్లు తగ్గిపోతాయి. కొన్ని మందుల వల్ల ఏర్పడే దుష్ప్రభావాల వల్ల కూడా లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటి సమయంలో మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను సంప్రదిస్తే నష్టాన్ని ముందుగానే అడ్డుకోవచ్చు.
ఏ వయస్సు నుంచి లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది?: చిత్రం ఏమిటంటే పురుషుల్లో ఏ వయస్సులోనైనా లైంగిక సామర్థ్యం తగ్గిపోవచ్చట. అయితే, 40 ఏళ్ల వయస్సు రాగానే క్రమేనా లైంగిక శక్తి తగ్గిపోవడం మొదలవుతుంది. 30 ఏళ్ల వయస్సులోనే దీనికి బీజం పడుతుందట. అంటే, మీరు 30 ఏళ్ల వయస్సు నుంచే మీ లైంగిక సామర్థ్యంపై ఒక కన్నేసి ఉంచాలి. 40 సంవత్సరాల వయస్సు తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిల్లో సహజ పతనం మొదలవుతుంది. దీని వల్ల మీరు ఎక్కువ సేపు సెక్స్ చేయలేరు. అంగస్తంభన కూడా కష్టమవుతుంది. ఎక్కువ సమయం తీసుకుంటుంది.
టెస్టోస్టెరాన్ తగ్గితే.. ఇక అంతే: యుక్తవయస్సులో పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి అనారోగ్యాలు లేకపోతే 30 ఏళ్ల వరకు టెస్టోస్టెరాన్ చురుగ్గా ఉంటుంది. 30 నుంచి 40 సంవత్సరాల మధ్య పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిలు ప్రతి సంవత్సరం 1% తగ్గుతాయి. అయితే, ఈ సమస్యను గుర్తించడం కష్టమే. 40 ఏళ్ల తర్వాత టెస్టోస్టెరాన్ స్థాయిలు మరింత తగ్గడం వల్ల క్రమేనా సమస్య బయటపడుతుంది. అది తెలుసుకొనే లోపే చాలా నష్టం జరిగిపోతుంది.
టెస్టోస్టెరాన్ అంటే ఏమిటి?: టెస్టోస్టెరాన్ అనేది మగ సెక్స్ హార్మోన్. ఇది ప్రధానంగా వృషణాలలో ఉత్పత్తి అవుతుంది. ఇది పురుషుల్లో లైంగిక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీలలో కూడా టెస్టోస్టెరాన్ ఉంటుంది. కానీ చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. టెస్టోస్టెరాన్ సెక్స్ డ్రైవ్‌తో మాత్రమే ముడిపడి ఉండదు. ఇది శరీర వెంటుకలు, కండరాలు, స్పెర్మ్, ఎర్ర రక్త కణాలపై కూడా ప్రభావం చూపుతుంది.
భయపడొద్దు చికిత్సలు ఉన్నాయ్: అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి కొన్ని వైద్య పరిస్థితు వల్ల కూడా లైంగిక సామర్థ్యానికి అవసరమైన టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తాయి. స్లీప్ అప్నియా చికిత్సతో తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయి రివర్ష్ అవుతుంది. ఫలితంగా సెక్స్ డ్రైవ్ మెరుగవుతుంది. టెస్టోస్టెరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ మీ టెస్టోస్టెరాన్ స్థాయిని మరియు సెక్స్ డ్రైవ్‌ను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. కానీ, మీ లైంగిక సమస్యలను దాచకుండా వైద్యుడికి తెలియజేయాలి.
లైంగిక సామర్థ్యం తగ్గకూడదంటే ఇలా చేయండి:
పండ్లను ఎక్కువగా తీసుకోండి: మీరు పండ్లను ఎక్కువగా తీసుకోండి. అరటిపండ్లు, అవకాడోలు లైంగిక సామర్థ్యా్న్ని పెంచుతాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. ఇవి జననేంద్రియాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. ఫలితంగా మీరు ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని పొందుతారు.
చాక్లెట్స్ తినండి: చాక్లెట్లు లైంగిక కోరికలు కలిగిస్తాయంటే మీకు ఆశ్చర్యంగానే ఉండవచ్చు. కానీ, ఇది నిజం. చాక్లెట్ లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది. చాక్లెట్ మీ శరీరంలోకి ఫినెథైలమైన్, సెరోటోనిన్ ట్రస్టెడ్ సోర్స్ అనే రసాయనాల విడుదలు చేయడానికి సహకరిస్తుంది. మీకు సెక్స్ చేయాలనే మూడ్ కలిగిస్తుంది.
తులసి, వెల్లులిని తీసుకోండి: ఔనండి, వెల్లులి, తులసి కూడా లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తులసి ఆకుల వాసన ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంది. వెల్లులిలో ఉండే అల్లిసిన్ రక్త ప్రసరణను పెంచుతుంది. జింగో బిలోబా అనే చైనీస్ మూలికం కూడా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందట. మరి, అది ఇండియాలో దొరుకుతుందో లేదో డౌటే.
యోహింబైన్ బెరడు: పశ్చిమ ఆఫ్రికాలోని యోహింబైన్ అనే చెట్టు బెరడులో ఉండే ఆల్కలాయిడ్ వయగ్రాలా పనిచేస్తుందట. అది అంగస్తంభనను కూడా మెరుగుపరస్తుందట. అవి అందుబాటులో లేకపోయినా పర్వాలేదు. మీకు లభించే ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా మీ సెక్స్ డ్రైవ్‌ను పెంచుకోవచ్చు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి: మీరు మానసికంగా కూడా మెరుగ్గా ఉండాలి. సెక్స్ గురించి ఎక్కువ దిగులు చెందకూడదు. మంచి ఆహారం, వ్యాయమాలు చేయడం ద్వారా మీరు 70 ఏళ్ల వరకు లైంగిక సామర్థాన్ని కొనసాగించవచ్చు. మీ లక్ బాగుంటే ఆ తర్వాత కూడా ఛాన్స్ ఉండవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. లోపాల గురించి కూడా మీలో ప్లస్ పాయింట్స్ గురించి ఆలోచించండి. పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. సెక్సును ఆనందంగా ఫీలవ్వండి. ఏదో లోపం ఉందని భయపడొద్దు.
రెండు గ్లాసుల వైన్ తీసుకోండి: మీరు రెండు గ్లాసుల వైన్ తీసుకుంటే చాలు. లైంగిక కోరికలు కలుగుతాయి. అది మీ అంగస్తంభన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే, మోతాదు మించితే మొదటికే మోసం వస్తుంది. మద్యం మోతాదు పెరిగితే లైంగిక సామర్థ్యం త్వరగా క్షీణిస్తుంది. ఆల్కహాల్ మీ భావప్రాప్తి సామర్థ్యాన్ని నిరోధిస్తుంది.
ధ్యానం, యోగా, వ్యాయామం: ధ్యానంతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వ్యాయామంతో ఫిట్‌నెస్ సాధించండి. మీరు ఒత్తిడికి గురైతే సెక్స్‌ను ఆస్వాదించలేదు. అది క్రమేనా మీ లైంగిక సామర్థ్యానికి విలన్‌గా మారుతుంది. ఒత్తిడిని తగ్గించుకోడానికి సెక్స్ కూడా ఒక మందు. కాబట్టి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. సెక్స్ చేసి ఒత్తిడి తగ్గించుకోండి. ఒత్తిడి తగ్గించుకుని సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోండి. అంతేకాదు.. మంచి సెక్స్‌కు చక్కని నిద్ర కూడా అవసరం. మీ భాగస్వామితో చనువుగా ఉండండి. మహిళలంటే భయం, బిడియం వంటి ఉన్నా.. వాటిని దూరం చేసుకుని స్వేచ్ఛగా ఉండండి. కానీ, వారికి ఇష్టం లేకుండా మీరు ఎలాంటి ఒత్తిడి వారిపై తీసుకురాకూడదని గుర్తుంచుకోండి. కాబట్టి, మీరు 30 ఏళ్ల వయస్సు నుంచే మంచి ఆహారం, వ్యాయమాల ద్వారా లైంగిక సామర్థ్యంపై దృష్టిపెట్టండి. 70 ఏళ్ల వరకు మీకు తిరుగు ఉండదు.
Also Read: దొంగను పట్టించిన దోమలు, చంపినవాడిపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాయ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.