Sweating : చెమట పడితే నిజంగానే బరువు తగ్గుతారా? ఇది వాస్తవమా లేక అపోహ
కొంతమందికి బాగా పని చేసిన, వ్యాయామం చేసిన చెమట పట్టేస్తుంది. చెమట బాగా పట్టడం వల్ల బరువు తగ్గుతామని అనుకుంటారు. మరి అది నిజమా? లేక అపోహ మాత్రమేనా..
వ్యాయామం చేస్తే బాగా చెమట పడుతుంది. ఎంత ఎక్కువ చెమట పడితే అంతగా కేలారీలు ఖర్చు అయి బరువు తగ్గినట్టని అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. చెమట పడితే నిజంగా బరువు తగ్గినట్టు కాదని నిపుణులు చెబుతున్నారు. చెమట అనేది శరీరం ఎంత శ్రమించిందనే దానికి సంకేతమనే కానీ బరువు తగ్గేందుకు కాదని అంటున్నారు. అసలు చెమట ఎందుకు పడుతుంది? దాని వల్ల మనకి మేలు జరుగుతుందా? అనేది తెలియాలంటే ఇది చదవాల్సిందే.
చెమట అసలెందుకు పడుతుంది
వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ స్థాయి పెరగడం వల్ల మనకు చెమట పడుతుంది. ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రతిస్పందనగా శరీరంలోని స్వేద గ్రంథులు చెమట ప్రక్రియను ప్రారంభిస్తాయి, ఇది చెమటకు దారితీస్తుంది. ఇదే కాకుండా మనలో చెమటను కలిగించే అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఒకరికి ఒత్తిడిలో ఉన్నప్పుడు చెమటలు పడతాయి, మరొకరికి హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుదల కారణంగా శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వల్ల కూడా చెమటలు పడతాయి. అంతేకాదు కఠినమైన శారీరక వ్యాయామం చేసినప్పుడు కూడా బాగా చెమట పట్టడం జరుగుతుంది. ఒక వ్యక్తికి జ్వరం తగ్గిన తర్వాత కూడా చెమటలు పట్టడం సాధారణంగా జరుగుతుంది.
చెమట పడితే కేలరీలు కరుగుతాయా?
చెమట అనేది శరీరాన్ని చల్లబరుస్తుంది. చెమటను ఉత్పత్తి చేసే దాన్నిబట్టి మీరు బర్న్ చేసే కేలరీల పరిమాణాన్ని ఎక్కువగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకి కఠినమైన వ్యాయామం చేసిన సమయంలో విపరీతంగా చెమటలు పడతాయి. అదే సమయంలో కేలరీలను కూడా ఖర్చు అవుతాయి. కానీ ఇది చెమట మరియు బరువు తగ్గడం మధ్య ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండదు.
చెమట పట్టడం వల్ల ఏం జరుగుతుంది
శరీరంలో నీరు చెమట రూపంలో బయటకి వస్తుంది. చెమటలో సోడియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా తక్కువ మొత్తంలో ఉంటాయి.
ఈ మూలకాలు శరీరానికి చాలా అవసరం కాబట్టి, చెమట పట్టే సమయంలో అవి తొలగిపోతాయి. అందుకే వాటిని మళ్ళీ తిరిగి పొందేందుకు మనం పోషకాలు నిండిన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
చెమట వస్తే బరువు తగ్గుతారనే అపోహకి కారణాలు
వాతావరణంలో ఉష్ణోగ్రత, బరువు తగ్గడానికి చేసే వ్యాయామాల వల్ల బాగా చెమట పడుతుంది. దాని వల్ల మనం అలసటకు గురవుతాం. చెమట పడితే బరువు తగ్గుతామని అనుకుంటాం. అందుకే చెమట వస్తే కేయలరీలు బాగా ఖర్చు అయిపోతున్నాయనే భావన కలిగి ఉండటం వల్ల బరువు తగ్గుతామని అపోహ పడతారు. కానీ అది వాస్తవం కాదు.
కేలరీలు ఎలా ఖర్చవుతాయ్
బరువు తగ్గేందుకు సరైన వ్యాయామాలు చెయ్యడం వల్ల కేలరీలు అధికంగా బర్న్ అవుతాయి. అదనపు కొవ్వును పోగొట్టుకునేందుకు సురక్షితమైన మార్గం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడమే. మనం తీసుకునే ఆహారం మనకి ఎన్ని కేలరీలు ఇస్తుందని విషయం మీద అవగాహన ఉండాలి. అప్పుడే సరైన ఆహారాన్ని తీసుకోగలుగుతాము. ఒక వ్యక్తి బర్న్ చేసే కేలరీల పరిమాణం శారీరక శ్రమ మరియు స్వభావంపై ఆధారపడి ఉంటుంది. శరీరంలోని కొవ్వు మీరు చురుకుగా ఉన్నపుడు మాత్రమే కారుగుతుంది, అంటే కానీ చెమట పట్టడం వాళ్ళ కాదనే విషయం గ్రహించాలి.
Also Read: దొంగను పట్టించిన దోమలు, చంపినవాడిపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాయ్!
Also Read: బఫె తింటున్నారా? అందులో వీటిని చేర్చకుండా ఉండటమే ఉత్తమం