News
News
వీడియోలు ఆటలు
X

Whale Vomit: కోట్లు విలువ చేసే తిమింగలం వాంతి - మనదేశంలో మాత్రం ముట్టుకుంటే చట్ట విరుద్ధం

వాంతి కూడా కోట్లు విలువ చేస్తుందా అని ఆలోచిస్తున్నారా? తిమింగలం వాంతి చాలా ఖరీదు.

FOLLOW US: 
Share:

Whale Vomit: ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల్లో అతి భారీ జంతువు తిమింగలం. సముద్రం మధ్యలో లోతైన ప్రాంతాల్లోనే ఇది జీవిస్తుంది. ఒడ్డుకు రావడం చాలా కష్టం. ఆ భారీ శరీరంతో ఒడ్డుకొచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్లడం కష్టం కాబట్టి ఇది దాదాపు సముద్రం మధ్యలోనే మునకలు వేస్తుంది. అయితే తిమింకిలాల్లో ఒక రకం ‘స్పెర్మ్ వేల్’. ఇది అప్పుడప్పుడు ఆహారాన్ని తిన్నాక వాంతి చేసుకుంటుంది. ఆ వాంతిని అంబర్ గ్రిస్ అని పిలుస్తారు. దాని కోసం ఎంతోమంది స్మగ్లర్లు రెడీగా ఉంటారు. అది కోట్లు విలువ చేస్తుంది. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని కోట్లు గడిస్తున్న వ్యాపారులు ఉన్నారు. ఇది తిమింగలం శరీరంలో ఎందుకు ఉత్పత్తి అవుతుందో మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కచ్చితంగా కారణాన్ని కనిపెట్టలేకపోయారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం తిమింగలంలోని జీర్ణవాహిక ఆ చేప తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసేందుకు ఈ అంబర్ గ్రిస్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నాయి. అది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు. ఆహారం తిన్నాక  ఈ అంబర్ గ్రిస్‌ను తిమింగలాలు బయటికి ఉమ్మేస్తాయి. అది సముద్రంపై తేలియాడుతూ ఉంటుంది. వీటి కోసమే ఎంతో మంది స్మగ్లర్లు సముద్రంలో నిత్యం తిరుగుతు ఉంటారు. అందుకే దీన్ని నీటిపై తెలియాడే బంగారంగా చెబుతారు. 

ఎంత ఖరీదు?
ఈ తిమింగలం వాంతి కిలో కొనాలంటే కోటిరూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. బంగారం కంటే ఇది ఎంతో విలువైనది. చక్కటి పరిమళాన్ని వెదజల్లుతుంది.

ఎందుకంత ఖరీదు?
ఈ వాంతిని ప్రఖ్యాత సెంట్ల తయారీలో వాడతారు. అలాగే కొన్ని రకాల ఔషధాలలో కూడా ఈ వాంతిని వినియోగిస్తారు. జీర్ణశక్తికి, నరాల సంబంధం రుగ్మతలకు ఆయుర్వేదంలో కూడా ఈ అంబర్ గ్రిస్ ను వాడతారు. అందుకే ఈ వాంతి చాలా ఖరీదు. 

మనదేశంలో చట్టవిరుద్ధం
చాలా దేశాల్లో దీన్ని అమ్ముతూ ఉంటారు. కానీ మన దేశంలో ఈ పదార్థాన్ని అమ్మడం చట్ట విరుద్ధం. ఎందుకంటే స్పెర్మ్ వేల్ అంతరించిపోతున్న జాతుల్లో ఒకటి. 1970లోనే దీన్ని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది మన దేశం. కేవలం ఈ వాంతి కోసం ఎంతోమంది వాటిని వేటాడుతున్నారు. అందుకే ఆ పదార్థాన్ని నిషేధించింది. అయితే యూరోపియన్ యూనియన్ లోని దేశాల్లో దీన్ని అమ్మడం చట్టబద్ధమైనది. అక్కడ eBay సైట్లలో కూడా దీన్ని అమ్ముతున్నారు. మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, అమెరికాలో కూడా దీన్ని నిషేధించారు. మాల్దీవులు,  బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో మాత్రం చట్టబద్ధంగా అమ్ముతారు. 

Also read: ఆ ఒక్క యాప్ నుంచే పాతిక కోట్ల రూపాయల విలువైన మామిడి పండ్లను ఆర్డర్ చేశారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 21 May 2023 09:16 AM (IST) Tags: Whale vomit Ambergris What is Ambergris Uses of Whale Vomit

సంబంధిత కథనాలు

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Thick Hair Tips: ఒత్తైన జుట్టు కోసం వంటింటి చిట్కాలు

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

Sleeping Rules in Shastra: దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

గుండె జబ్బుల నివారణకు మంచి పరిష్కారం ఈ జ్యూస్

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

High Cholesterol: కొవ్వుతో జర భద్రం - ఈ లక్షణాలు కనిపిస్తే కొలెస్ట్రాల్ ప్రమాదం పెరుగుతోందని అర్థం!

టాప్ స్టోరీస్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్