షుగర్ ఎక్కువగా తింటున్నారని చెప్పే సంకేతాలు ఇవే పంచదార ఎక్కువ తినడం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతుంది. షుగర్ తో చేసే ఆహారాలు తినడం తగ్గించుకోవాలి. తీపి పదార్థాలు అధికంగా తింటుంటే శరీరం కొన్ని లక్షణాల ద్వారా బయటపెడుతుంది. శక్తి హీనంగా అనిపిస్తుంది. నీరసం వచ్చేస్తుంది. తెలియకుండానే బరువు పెరుగుతారు. దంతక్షయం వస్తుంది. చర్మం ముడతలు, గీతలు పడుతుంది. జీర్ణ క్రియ సమస్యలు వస్తాయి. మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి.