హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం చిట్కాలు ఇవిగో తల్లి కావడం వరం. గర్భం ధరించడానికి ముందు నుంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి కావడానికి శరీరాన్ని సిద్ధం చేయాలి. విటమిన్లు, ఖనిజాలను వైద్యులను సంప్రదించి ఆ సప్లిమెంట్లను తీసుకోవాలి. వ్యాయామం చేయడం రోజూ అలవాటుగా మార్చుకోవాలి. రోజూ ఓ పదినిమిషాలు ధ్యానం చేయాలి. ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే మానేయాలి. శరీరంలో తేమవంతంగా ఉండేలా చేసుకోవాలి. ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. కాఫీ, టీలు తాగడం మానేయాలి. పాలకూర, పండ్లు అధికంగా తినాలి.