క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. కానీ వ్యాయామ అలవాట్లు ఇలా ఉంటే మాత్రం శరీరాన్ని నాశనం చేస్తుంది. ఓవర్ ట్రైనింగ్ వల్ల 30 ఏళ్ల తర్వాత ఎక్కువ హాని చేస్తుంది. బర్న్ అవుట్, జీర్ణక్రియ, గాయాలకు కారణమవుతుంది. ఒకే వ్యాయామం పునరావృతం చేయడం వల్ల శరీరం దానికే అలవాటుపడుతుంది. దీర్ఘకాలంలో అది పనికిరాకుండా పోతుంది. ఫిట్ నెస్ విషయంలో చాలా మంది చేసే తప్పు సరిగా తినకపోవడం. దీని వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. వర్కవుట్ చేసే ముందు వార్మప్ చేయడం మంచిది. లేదంటే కండరాలు ధృడత్వాన్ని కోల్పోతాయి. ముందుగా తేలికపాటి వ్యాయామాలు చేయకుండా నేరుగా అధిక ప్రభావమైన వర్కవుట్స్ చేస్తే తర్వాత ఇబ్బంది పడతారు. వ్యాయామం చేసే ముందు బాడీ స్ట్రెచ్చింగ్ చాలా ముఖ్యం. లేదంటే తర్వాత తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. వ్యాయామం తర్వాత శరీరం కోలుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. Image Credit: Pexels