ఒక్క మస్కిటో కాయిల్ 100 సిగరెట్లతో సమానం



దోమల నుండి తప్పించుకోవడం కోసం ఇంట్లో ఎంతో మంది మస్కిటో కాయిల్స్ ను వాడతారు.



ఆ పొగ వల్ల ఇంట్లోని మనుషులకు తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఆ పొగ 100 సిగరెట్లు కాల్చడంతో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.



మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగను పీల్చే వ్యక్తులకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనారి డిసీజ్ (COPD) వచ్చే అవకాశం ఎక్కువనే చెబుతున్నారు వైద్యులు.



ముంబైలో ప్రతిరోజు ఆరుగురు వ్యక్తులు ఈ దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధికి కారణమై ప్రాణాలు కోల్పోతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.



అధ్యయనం ప్రకారం 2019లో COPD కారణంగా మన దేశంలో ప్రతి లక్ష మందిలో 98 మంది మరణించినట్టు అంచనా.



ధూమపానం అలవాటు లేని వారు కూడా మస్కిటో కాయిల్స్ కారణంగా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడి మరణిస్తున్నారు.



గర్భిణీ స్త్రీలు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు, పిల్లలు ఈ పొగను పీల్చడం చాలా ప్రమాదకరం.



రక్తంలో ఈ పొగ కలిసి గుండె వరకు చేరితే ప్రాణాంతక పరిస్థితులు రావచ్చు.