అతి చల్లని పానీయలతో గుండెపోటు వచ్చే అవకాశం? గుండెపోటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య. ప్రతిరోజు లక్షలాదిమందికి గుండెపోటు వస్తున్నట్లు అంచనా. ఎండల్లో ఇంటికి వచ్చిన వెంటనే చాలామంది చేసే పని ఫ్రిజ్ లోంచి అతి చల్లని నీరు తీసి తాగడం. ఇది ధమనుల్లో ఆకస్మిక వాసోస్పాస్మ్ ఏర్పడడానికి కారణం అవుతుంది. ధమనులు కూచించుకుపోయి రక్త ప్రవాహానికి అడ్డు తగులుతాయి. ఈ పరిస్థితి గుండెపోటుకు కారణంగా మారుతుంది. చల్లని నీరు గుండెపోటుకు ట్రిగ్గర్‌గా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చల్లని నీరును తాగడం మానుకోండి. గుండె సమస్య ఉన్న వారిలో ఇలా చల్లని నీరు తాగడం ప్రాణాంతకమైన కార్డియాక్ అరిథ్మియాను ప్రేరేపిస్తుంది. చల్లని నీరు తాగిన వెంటనే శరీరం తీవ్రమైన ప్రతిస్పందనను చూపిస్తుంది. ఆ ప్రతిస్పందనలో గుండెపోటు కూడా రావచ్చు. చల్లని పానీయాలు తాగడం తగ్గించాలి. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగాలి.