విటమిన్ బి12 లోపిస్తే చాలా డేంజర్ పోషకాహార లోపం అనేది కేవలం పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా వస్తుంది. ఎక్కువగా పెద్దల్లో విటమిన్ B12 లోపించే అవకాశం ఉంది. ఒకవేళ విటమిన్ బి12 లోపం ఉన్నప్పటికీ దానికి తగ్గ ఆహారం, సప్లిమెంట్లు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ లోపం దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తి కోల్పోతారు. నడక స్థిరంగా ఉండదు. సమన్వయంతో కాళ్లు పనిచేయలేవు. విటమిన్ బి12 లోపం వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింతగా క్షీణిస్తుంది. ఈ లోపం వల్ల నరాలు దెబ్బతింటాయి. కంటిలోని ఆప్టిక్ నరం దెబ్బ తినే అవకాశం ఉంది. ఈ విటమిన్ లోపిస్తే ముఖ్యంగా కనిపించే లక్షణం తీవ్ర అలసట. తలనొప్పి తరచూ వస్తూ ఉంటే అది విటమిన్ బి12వ లోపం వల్లేమో అని చెక్ చేయించుకోవాలి.