హైబీపీ వస్తే కనిపించే నిశ్శబ్ధ లక్షణాలు ఇవి అధిక రక్తపోటు అంటే 140/90 mm Hg కంటే ఎక్కువగా ఉంటే హైబీపీగా నిర్ణయిస్తారు. అధిక రక్తపోటుకు తగిన మందులు వాడకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 30 ఏళ్ల నుంచి 79 సంవత్సరాల లోపు వయసుగల వారిలో 128 కోట్ల మంది అధిక రక్తపోటును కలిగి ఉన్నారు. అధిక రక్తపోటు ఉన్నప్పుడు కనిపించే కొన్ని నిశ్శబ్ద లక్షణాలు ఉన్నాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. అధిక రక్తపోటు వల్ల గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. వేగంగా గుండె కొట్టుకుంటుంది. తీవ్రమైన తలనొప్పి రావడం కూడా హైబీపీకి సంకేతమే. చెవుల్లో గుసగుసలాడే శబ్దం వినిపిస్తున్న కూడా రక్తపోటు నియంత్రణలో లేదని అర్థం. వైద్యపరంగా దీన్ని ‘టిన్నిటస్’ అంటారు. తల తిరగడం, మైకం కమ్మడం వంటివి కూడా అధిక రక్తపోటులో భాగమే. గందరగోళంగా అనిపిస్తున్నా కూడా అది అధిక రక్తపోటు సంకేతం గానే భావించాలి.