వ్యాయామం చేస్తే ఆస్తమా పెరుగుతుందా?



ఆస్తమా చెప్పుకునేందుకు చిన్న సమస్య అయినా దానితో బాధపడే వారికి తెలుస్తుంది... ఆస్తమాను భరించడం ఎంత కష్టమో.



వ్యాయామం చేయడం ఆస్తమా పెరుగుతుందని కొంతమంది భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.



వ్యాయామం చేసినప్పుడు తీవ్రంగా అలసిపోతాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది మరి కొంచెం కష్టంగా ఉంటుంది.



ఆస్తమా రోగులలో వ్యాయామం చేసే సమయంలో ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలు కుచించికుపోతాయి.



దగ్గు, ఛాతీ బిగుతుగా పట్టినట్టు అనిపిస్తుంది. ఒక గంట వరకు ఈ లక్షణాలన్నీ ఇబ్బందిపెడతాయి. తరువాత సాధారణ స్థాయికి వస్తాయి.



ఆస్తమా ఉన్నవారు వ్యాయామం చేయడానికి బయటికి వెళ్లడం మానుకోండి.



చల్లని, పొడి గాలిలో వ్యాయామం చేయడం వల్ల ఆస్తమా లక్షణాలు పెరుగుతాయి.



మీకు అలెర్జీ ఉన్నట్లయితే కలుషితమైన గాలి, మొక్కలు, పువ్వులు ఉన్నచోట వ్యాయామం చేయవద్దు.