నెయిల్ పాలిష్‌తో ప్రాణాంతక అలెర్జీ పొడవైన గోళ్లు, వాటిపై రంగురంగుల నెయిల్ పాలిష్ డిజైన్లు యువత మెచ్చే ఫ్యాషన్ గా మారింది. నెయిల్ పాలిష్ వల్ల ప్రాణాంతకమైన అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. నెయిల్ పాలిష్‌లలో మెథాక్రిలేట్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మం లోకి ప్రవేశించి చెడు ఎలర్జీలకు కారణం అవుతాయి. వీటివల్ల గోళ్లు పెళుసుగా మారి, విరిగిపోతాయి. దీర్ఘకాలంగా నొప్పి ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ చేతులకు సోకే అవకాశం ఉంది. నెయిల్ పాలిష్ లలో ట్రైఫెనెల్ ఫాస్పేట్ అనే రసాయనం కూడా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. నెయిల్ పాలిష్ వేసుకునే ముందు గోళ్లకు SPF30 అనే సన్‌స్క్రీన్ లోషన్ రాసి ఆ తరువాత నెయిల్ పాలిష్ వేసుకోవడం ఉత్తమం. ఎప్పుడో ఒకసారి నెయిల్ పాలిష్ వేసుకుంటే ఫర్వాలేదు కానీ, నిత్యం వేసుకునే వారికి మాత్రం హానికర ప్రభావాలు పడే అవకాశం ఉంది. నెయిల్ పాలిష్ వేసుకున్న చేత్తోనే అన్నం తింటే ఆ రసాయనాలు పొట్టలోకి చేరే అవకాశం కూడా ఉంది.