వీటిని తింటే క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు



ఎరుపు, పసుపు రంగులో ఉండే క్యాప్సికమ్‌లను తినేవారి సంఖ్య చాలా తక్కువ. వీటిని బెల్ పెప్పర్స్ అంటారు.



పులావ్‌లలో, బిర్యానీలలో, సలాడ్లలో, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ లాంటి వాటిలో వీటిని వేసి వండుకోవచ్చు.



ఎలా అయినా కూడా వీటిని డైట్ లో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.



వీటిలో లూటీన్, జియాక్సింతిన్ అనే కెరోటాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.



వీటిలో క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ బెల్ పెప్పర్స్ సూపర్ ఫుడ్ అని పిలుచుకోవచ్చు.



క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే బెల్ పెప్పర్స్ మెనూలో భాగం చేసుకోవాలి.



బెల్ పెప్పర్స్‌లో లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. అవి గుండెను కాపాడాతాయి.



కొందరికి బెల్ పెప్పర్స్ వల్ల అలెర్జీ కలిగే అవకాశం ఉంది. కనుక ఈ ఆహార పదార్థం పడుతుందో లేదో తెలుసుకున్నాకే ఎక్కువ మొత్తంలో తినాలి.