X

Weird Laws: అండర్‌వేర్‌తో కారు తుడిస్తే నేరం.. డ్రైవర్ తాగితే పక్కోడికి ఫైన్.. ఇవేం చట్టాలండి బాబు!

కారు నడుపుతూ విజిల్ వేస్తున్నారా? ఎడ్ల బండి కంటే వేగంగా కారు నడుపుతున్నారా? అయితే, మీకు జరిమానా తప్పదు.

FOLLOW US: 

ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మనకు మాత్రమే కాదు.. ఇతరులకు కూడా సురక్షితమే. అయితే, ప్రపంచంలోని పలు దేశాల్లో అమల్లో ఉన్న ట్రాఫిక్ నిబంధనలు చాలా చిత్రంగా ఉంటాయి. వాటిలో కొన్ని కఠినంగా ఉంటే.. మరికొన్ని సిల్లీగా ఉంటాయి. ఇంకొన్ని ముక్కున వేలేసుకొనేలా ఉంటాయి. గందరగోళానికి గురిచేసే ట్రాఫిక్ నిబంధనలు కూడా చాలానే ఉన్నాయి. మరి, అవేంటో చూసేద్దామా!


కారు అపరిశుభ్రంగా ఉంటే ఫైన్ తప్పదు: కొంతమందికి కారు క్లీన్ చేయాలంటే చాలా బద్దకం. దుమ్ముదూళి పట్టినా పట్టించుకోరు. ఆ దుమ్మతోనే రోడ్లపైకి వచ్చేస్తారు. అయితే, రష్యాలో మాత్రం లేజీగా ఉంటే కుదరదు. తప్పకుండా వాహనాలు శుభ్రంగా ఉండాలి. డర్టీగా ఉంటే సుమారు రూ.3 వేలు వరకు జరిమానా విధిస్తారు. 


కేకలు వేస్తే.. జరిమానా: ఈ రూల్ తప్పకుండా ఉండాల్సిందే. ముఖ్యంగా మన ఇండియాలో. మేరీల్యాండ్‌లోని రాక్‌విల్లేలో అరవడం, కేకలు వేయడం, తిట్టుకోవడం నేరం. ఇందుకు సుమారు రూ.5,800 జరిమానా విధిస్తారు. లేదా 90 రోజులు జైలు శిక్ష విధిస్తారు. 


హెడ్‌లైట్స్ 24 గంటలు ఆన్‌లోనే ఉండాలి: ఇది కాస్త చిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే.. స్వీడన్‌లో ఎప్పుడు కారు నడిపినా లైట్లు ఆన్‌లోనే ఉండాలి. అంటే.. పగలు కూడా లైట్లు ఆర్పకూడదు. ఎందుకంటే.. స్వీడన్‌లో చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది. పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. అందుకే ఆ రూల్ పెట్టారు. 


డ్రైవ్ చేసేవారు తాగొచ్చు.. కానీ, తాగకూడదు: ఇది కాస్త చిత్రంగా ఉంది కదూ. తాగొచ్చు కానీ.. తాగకూడదనే రూల్ ఏమిటనేగా మీ సందేహం కూడా. ఔనండి.. కొస్టా రికాలో డ్రైవింగ్ చేసేవారిలో బ్లడ్-ఆల్కహాల్ స్థాయి 0.75 శాతాన్ని మించకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే జరిమానా తప్పదు. మరి, అంత కచ్చితంగా ఎలా తాగడమనేగా మీ సందేహం. ఆ పాట్లేవో మీరే పడండి అని పోలీసులు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. మద్యం తాగడం కంటే.. మంచి నీళ్లు తాగడం బెటర్ కదూ. 


తాగినవాళ్లు ముందు సీట్లో కూర్చోకూడదు: డ్రైవింగ్ చేసేవారు మద్యం తాగకూడదనే రూల్ ఉంది సరే.. ప్యాసింజర్ సీట్లో కూర్చొనేవారు కూడా మందు కొట్టకూడదా? ఇదేదో చిత్రంగా ఉందే. మాసిడోనియాలో మద్యం తాగి మందు సీట్లో కూర్చొంటే పోలీసులు ఫైన్ వేస్తారు. 


డ్రైవర్ తాగితే.. ప్యాసింజర్‌కు జరిమానా: జపాన్‌లో మరో రూల్ ఉంది. డ్రైవర్ మద్యం తాగి కారు నడిపితే.. అందులో ప్రయాణించే ప్యాసింజర్స్‌కు కూడా జరిమానా విధిస్తారు. కాబట్టి.. ఎవరైనా ట్యాక్సీ ఎక్కితే ఆ డ్రైవర్ తాగాడో.. లేదో నిర్ధరించుకుని ఎక్కడం బెటర్. 


అండర్‌వేర్‌తో కారు తుడిస్తే తప్పు: కారు తుడిచేందుకు మెత్తని వస్త్రం ఉంటే చాలని అనుకుంటాం. కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో మాత్రం వాడేసిన అండర్‌వేర్‌తో కారు లేదా ఇతర వాహనాలను శుభ్రం చేయకూడదు. అయినా.. మనం ఇంట్లో అండర్‌వేర్‌తో కారు తుడిస్తే.. పోలీసులకు ఎలా తెలుస్తుంది? మరీ చిత్రం కాకపోతే!


Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!


సోమవారం ఆ కార్లు నడపకూడదు: మనీలాలో మరో వింత చట్టం ఉంది. సోమవారం 1 లేదా 2 నెంబర్లు కలిగిన నెంబర్ ప్లేట్ ఉండే కార్లను నడపకూడదు. 
⦿ థాయ్‌లాండ్‌లో షర్ట్ లేకుండా కారు నడిపితే ఫైన్ వేస్తారు. 
⦿ స్విట్జర్లాండ్‌లో కారు డోరు గట్టిగా వేస్తే జరిమానా విధిస్తారు. 
⦿ అలబామాలో కళ్లకు గంతలు కట్టుకుని వాహనాలు నడపకూడదు.
⦿ అరిజోనాలోని గ్లెండాలేలో కారును వెనక్కి నడిపడం నేరం. 
⦿ సిసిరోలో ఆదివారాలు వాహనం నడుపుతూ విజిల్ వేయకూడదు. 
⦿ ఓక్లామాలో డ్రైవింగ్ చేస్తూ కామిక్ పుస్తకం చదవకూడదు. 
⦿ కెనడాలోని జాస్పెర్ గేట్స్‌లో గుర్రపు బండి లేదా ఎడ్ల బండి కంటే వేగంగా కారు నడపకూడదు.


Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం


Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Funny Traffic Laws Weird Traffic Rules Weird Traffic Laws Funny Traffic Rules ఫన్నీ ట్రాఫిక్ రూల్స్

సంబంధిత కథనాలు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Solar Eclipse: నేడే సంపూర్ణ సూర్య గ్రహణం... మనకి కనిపించదు, అయినా సరే గ్రహణ సమయంలో ఈ పనులు చేయకూడదంటారు

Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే

Corona virus: శీతాకాలంలో కరోనాను తట్టుకునే శక్తి కావాలంటే... ఇవన్నీ తినాల్సిందే

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Breastfeed: విమానంలో పిల్లి పిల్లకు రొమ్ము పాలిచ్చిన మహిళ.. ప్రయాణికులు షాక్

Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Compostable Plates: ఇలాంటి పేపర్ ప్లేట్లలో రోజూ భోజనాలు లాగిస్తున్నారా? అయితే ఈ రోగాలు రాక తప్పవు

Pressure Cooker: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

Pressure Cooker: ఈ మూడు వంటలు ప్రెషర్ కుక్కర్లో వండకూడదు... అయినా వండేస్తున్నాం

టాప్ స్టోరీస్

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Bheemla Nayak Song Update : అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Solar Eclipse: సంపూర్ణ సూర్య గ్రహణాన్ని లైవ్‌లో చూసేయండి

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

Zawad Update: బలహీన పడుతున్న జవాద్... ముందస్తు జాగ్రత్తగా రెస్క్యూ టీంలు మోహరింపు

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల గోవా టూర్‌

TRS Leaders Goa Tour: సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీఆర్‌ఎస్‌ ఖమ్మం లీడర్ల  గోవా టూర్‌