అన్వేషించండి

Sleeping Issues : మధ్యరాత్రిలో మెలకువ వస్తే.. వెంటనే నిద్రపోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Waking up During the Night : కొందరికి మధ్యరాత్రిలో మెలకువ వస్తే మళ్లీ వెంటనే నిద్ర రాదు. ఆ సమయంలో కొన్నిటిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. 

Waking up in the Middle of the Night : కొందరికి నిద్ర లేట్​గా వస్తుంది. మరికొందరు తొందరగానే నిద్రపోయినా.. మధ్యలో మెలకువ వస్తుంది. వారిలో కొందరు మళ్లీ నిద్రపోగలుగుతారు.. మరికొందరు నిద్రపోలేరు. ఇలా మధ్య నిద్రలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర రాకపోతే.. అంసపూర్ణ నిద్ర అంటారు. దీనివల్ల ఆరోగ్యంపై, రోజూవారి పనులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మధ్యరాత్రిలో మెలకువ వస్తే.. మళ్లీ వెంటనే నిద్రపోవడానికి కొన్ని టిప్స్ సూచిస్తున్నారు నిపుణులు. అవి ఫాలో అయితే వెంటనే నిద్రపడుతుందని చెప్తున్నారు. 

మధ్యరాత్రిలో మెలకువకు కారణాలేంటి..

ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు, నిద్ర సమస్య ఉన్నప్పుడు మధ్యరాత్రిలో మెలకువ వస్తుంది. ఇవే కాకుండా పీడకలలు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఇతరత్రా సౌండ్స్ వల్ల కూడా మధ్యరాత్రిలో నిద్ర లేస్తారు. పడుకునే ముందు నీరు తాగడం వల్ల వాష్​ రూమ్​కి వెళ్లడం, దాహం వేయడం వంటివి కూడా ఈ మెలకువకు కారణమవుతున్నాయి. కారణం ఏది అయినా దానికి చెక్ పెట్టేందుకు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. 

ఒత్తిడిని తగ్గించుకోవాలి

స్ట్రెస్ అనేది తెలిసి ఒకలాగ.. తెలియక మరోలా ఇబ్బంది పెడుతుంది. కొందరికి ముందుగానే నిద్రను దూరం చేస్తే.. మరికొందరికి మధ్యరాత్రిలో నిద్రను దూరం చేస్తుంది. అందుకే ప్రశాంతమైన నిద్ర కావాలనుకునేవారు ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని యోగా టెక్నిక్స్, ఆసనాలు వేస్తూ ఉంటే.. స్ట్రెస్ తగ్గుతుంది. 

టైమ్ చెక్ చేయకండి.. 

మధ్యరాత్రిలో నిద్రలేచి టైమ్ చూస్తే.. నిద్ర దూరమవుతుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సమయం కూడా ఒత్తిడిని పెంచుతుందట. అంతేకాకుండా టైమ్ అయిపోతుంది పడుకోవాలనే ఓవర్ బర్డెన్​లో నిద్ర త్వరగా రాదు. కాబట్టి మీరు మధ్యలో నిద్ర లేచినా.. వీలైనంత త్వరగా పడుకోవాలి అంటే టైమ్​ని చూడకపోవడమే మంచిది. 

బెడ్​ రూమ్​ టిప్స్

మీ బెడ్​ రూమ్​లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయని వాతావరణం ఉంటే మీరు ఎక్కువసేపు నిద్రపోగలుగుతారు. కాబట్టి మీ రూమ్​ చీకటిగా.. నిశబ్ధంగా.. మీకు సరిపడా టెంపరేచర్​లో ఉండేలా చూసుకోండి. పరుపు కూడా నిద్రలో మేజర్​ రోల్ పోషిస్తుంది. కాబట్టి పరుపు దిండు విషయంలో కాంప్రమైజ్ కాకండి. 

మొబైల్ చూడకండి..

కొందరు నిద్ర రాకపోయినా.. నిద్రలో మెలకువ వచ్చినా.. వెంటనే మొబైల్ ఓపెన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నిద్ర మీకు మరింత దూరమవుతుంది. పైగా మొబైల్ లైట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. టీవీలు కూడా చూడకపోవడమే మంచిది. 

ఇతరత్రా కారణాలు ఇవే

ఇవే కాకుండా కెఫెన్ తాగడం, పడుకునే ముందు మంచినీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేయకూడదు. అలాగే బాగా ఫ్రై చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. పీడకల వచ్చినప్పుడు నిద్రపోవాలి అనుకుంటే బ్రీత్ ఎక్సర్​సైజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొందరు బెడ్​రూమ్​లో బెడ్ ల్యాంప్ ఉంటేనే నిద్రపోతారు. మరికొందరికి బెడ్ ల్యాంప్ లేకపోవడమే మంచిది. ఇది కచ్చితంగా నిద్రపై ప్రభావం చూపిస్తుందని మరచిపోకండి. సమస్య ఎక్కువైతే వైద్యులను సంప్రదించడం మరచిపోవద్దు.

Also Read : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MI vs CSK Match Preview IPL 2025 | నేడు వాంఖడేలో ముంబైని ఢీకొడుతున్న చెన్నై | ABP DesamPBKS vs RCB Match preview IPL 2025 | బెంగుళూరులో ఓటమికి పంజాబ్ లో ప్రతీకారం తీర్చుకుంటుందా | ABP DesamAvesh Khan Game Changer vs RR | IPL 2025 లో లక్నోకు గేమ్ ఛేంజర్ గా మారిన ఆవేశ్ ఖాన్ | ABP DesamYashasvi Jaiswal Vaibhav Suryavanshi | భలే క్యూట్ గా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు | ABP Desm

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
CM Chandrababu: సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
PBKS vs RCB: టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ, మొన్న ఓటమికి పంజాబ్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? కానీ వర్షం ముప్పు
Ponnam Prabhakar: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​.. ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
Malavika Mohanan: లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
లోకల్ ట్రైన్‌లో ముద్దు అడిగాడు - మాళవికా మోహనన్‌కు చేదు అనుభవం
MI vs CSK: నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
నేటి రాత్రి ముంబై వర్సెస్ చెన్నై హైటెన్షన్ మ్యాచ్, ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే నెగ్గాల్సిందే..
Digital Rape: ఐసీయూలో పేషెంట్‌పై డిజిటల్ రేప్ కేసులో నిందితుడు అరెస్ట్.. ఇంతకీ డిజిటల్ రేప్ అంటే ఏంటీ ?
ఐసీయూలో పేషెంట్‌పై డిజిటల్ రేప్ కేసులో నిందితుడు అరెస్ట్.. ఇంతకీ డిజిటల్ రేప్ అంటే ఏంటీ ?
Veera Chandrahasa: తెలుగులోకి 'వీర చంద్రహాస'... పాన్ ఇండియా హిట్స్‌కు మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ డైరెక్ట్ చేస్తే?
తెలుగులోకి 'వీర చంద్రహాస'... పాన్ ఇండియా హిట్స్‌కు మ్యూజిక్ చేసిన రవి బస్రూర్ డైరెక్ట్ చేస్తే?
Embed widget