Divorce Rate in Love Marriage : లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువగా విడిపోతున్నారట.. డివోర్స్ కేసులలో వీరిదే పై చేయి
Divorce Cases in India : డివోర్స్ తీసుకుంటున్నవారిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నవారే ఎక్కువ ఉన్నారని తాజాగా సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అసలు ఈ డివోర్స్‌కి ఏమి కారణమవుతున్నాయి.
Love Marriage Failures : ప్రేమికులు తమ ప్రేమని కలకాలం నిలవాలని కలలు కంటారు. జీవితాంతం తమ మధ్య ప్రేమ అలాగే ఉండాలని పెళ్లి చేసుకుంటారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ప్రేమ ఎక్కువ కాలం ఉండట్లేదని నిపుణులు. దీనివల్ల లవ్ మ్యారేజ్ చేసుకున్న ఎందరో విడిపోతున్నారు. డివోర్స్‌తో తమ ప్రేమ బంధానికి చెక్ పెట్టేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రేమించి పెళ్లిల్లు చేసుకున్నవారే ఎక్కువగా డివోర్స్ చేసుకుంటున్నారని తెలిపింది.
ఆ సినిమాలో చెప్పినట్టుగానే
ఆరెంజ్ సినిమాలో డైలాగ్ లాగా.. లవ్ కొంతకాలమే బాగుంటుంది అనేట్టు మారిపోయింది నేటి సొసైటి. అప్పట్లే ఈ డైలాగ్ విన్నవాళ్లకి ఇదే పెద్ద బూతులా కనిపించింది కానీ.. ఇప్పుడు అదే నిజమైంది. ఎందుకంటే అప్పట్లో ప్రేమ ఇలా కొన్నాళ్లకే ముక్కలైపోలేదు. కానీ ఇప్పుడు ఇన్స్టాంట్ బ్రేకప్స్ జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు దాదాపు ప్రేమించి పెళ్లి చేసుకుని.. కొన్నాళ్లకే దానికి శుభం కార్డు వేసేస్తున్నారు.
డివోర్స్ రేట్ పెరగడానికి కారణాలు ఇవే
పెద్దలు కుదిర్చి చేసిన వివాహంలో ఇద్దరు విడిపోవడానకి రెండు కుటుంబాలు అవసరమవుతాయి. ఒకరు కాకపోయినా.. మరొకరైనా సర్ది చెప్పడానికి ఉంటారు. ఇలా ఎవరో ఒకరు చెప్పేవారు ఉంటారు కాబట్టి.. దాదాపు పెద్దలు చేసిన వివాహాల్లో విడిపోవడం అనేది తక్కువగా ఉంటుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు గ్నీన్ సిగ్నల్ ఇచ్చినా.. లేదా పెద్ద ఎదురించి పెళ్లి చేసుకున్నా తర్వాత తంటాలు పడాల్సిందే ప్రేమించుకున్నవారే. గొడవలు ఇంట్లో తెలిస్తే నువ్వే ప్రేమించి పెళ్లి చేసుకున్నావని అంటారనే భయంతో.. వారికి చెప్పకుండానే కొందరు నిర్ణయాలు తీసేసుకుంటారు.
గ్రాడ్యుల్గా తగ్గిపోతున్న ప్రేమ
ఓ వ్యక్తిని ప్రేమించినప్పుడు వారితో ఎక్కువ సమయం కలిసి ఉండరు. కాబట్టి వారిని కలిసేందుకు ఆతృత.. కలవాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా వారి ప్రైవేట్ లైఫ్, పర్సనల్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉండే ఛాన్స్ ఉంది. కానీ పెళ్లి తర్వాత ఇవేవి ఉండవు. పొద్దున్న లేచినప్పటినుంచి.. రాత్రి పడుకునేవరకు ప్రేమించిన వ్యక్తి పక్కనే ఉంటారు. కాబట్టి వారితో ఉండాలనే కోరిక కొన్ని రోజులకు గ్రాడ్యుల్గా తగ్గిపోతూ ఉంటుంది. ప్రేమించిన వారికోసం ముస్తాబు కావడం నుంచి.. ఇంట్లో ఎలా ఉంటే ఏముందిలే అనే స్టేజ్‌కి ఇద్దరూ వెళ్లిపోతారు. ఇవన్నీ వారి నుంచి ప్రేమను దూరం చేస్తాయి.
కంఫర్ట్ లేకపోవడం కూడా..
ఓ వ్యక్తితో మరో వ్యక్తికి కంఫర్ట్ లేనప్పుడు ఆ బంధంలో ఎక్కువ కాలం ఉండలేరు. జాబ్స్‌కి వెళ్లినా.. ఇంట్లో ఉన్నా.. ఇంటికి బంధువులు వచ్చినా.. ఎక్కడో చోట వార్ మొదలవుతుంది. ఇండిపెండెంట్‌గా ఉండడం కాస్త కష్టమవుతుంది. తమ నిర్ణయాలు తామే తీసుకోలేకపోవడం.. ఎదుటివారికి సంజాయిషీ చెప్పాల్సి రావడం వంటివన్నీ.. కంఫర్ట్‌ని దూరం చేస్తున్నాయి. ప్రేమించికున్నప్పుడు నచ్చిన విషయాలన్నీ.. ప్రేమించిన తర్వాత చేదుగా మారిపోతూ ఉంటాయి. ఈ రీజన్స్‌ని గుర్తించి.. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లిన వారు లవ్ మ్యారేజ్‌లో సక్సెస్ అవుతున్నారు. లేని వారు డివోర్స్ని ఆశ్రయిస్తున్నారు.
దగ్గరుంటే అన్ని గొడవలే..
పార్టనర్‌ని అర్థం చేసుకోకపోవడం.. ముఖ్యం ప్రేమించిన వ్యక్తి లాయల్‌గా ఉండకపోవడం.. ప్రేమించి వ్యక్తిపై విరక్తి పెరగడం వంటివన్నీ డివోర్స్‌కి కారణమవుతున్నాయి. ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకున్నట్లు భావించడం ఎక్కువగా జరుగుతుంది. కుర్చోని సమస్యను తగ్గించుకోవచ్చనే స్టేజ్ నుంచి.. దగ్గరగా ఉంటే గొడవలే ఎక్కువ అవుతాయనుకునే స్టేజ్‌కి వెళ్లిపోతున్నారు. ఫినాన్షియల్‌గా ఒకరికి మంచి పేరు వస్తున్నా కూడా ఈ బంధం వీక్ అవుతున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. కొందరు మాత్రమే ఈ అన్ని సమస్యలను దాటుకుని.. తమ పెళ్లి జీవితాన్ని కాపాడుకుంటున్నారని తెలిపారు.
Also Read : మగవారికంటే ఆడవారే యూరిన్‌ను ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటారట.. సమస్య పెరగడానికి ఇదే ప్రధాన కారణం