Viral Video: కార్లు నీళ్లలోకి వెళ్తున్నాయేంటి అనుకుంటున్నారా? అసలు విషయం తెలిస్తే ఔరా అనాల్సిందే!
ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య పరుస్తాయి. అలాంటి వాటిలో ఒకటి నెదర్లాండ్స్ రివర్స్ బ్రిడ్జి. ఈ ఇంజినీరింగ్ నైపుణ్యానికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే!
ప్రపంచంలో ఎన్నో అద్భుత నిర్మాణాలు ఉన్నాయి. వాటిని చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోక తప్పదు. ఇండియాలోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ నుంచి మొదలుకొని దుబాయ్ మ్యూజియం వరకు ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలున్నాయి. అలాంటి అద్భుత కట్టడాల్లో ఒకటి నెదర్లాండ్స్ లోని ప్రపంచ ప్రఖ్యాత రివర్స్ బ్రిడ్జి. ఈ నిర్మాణాన్ని చూస్తే ఔరా అనాల్సిందే.
ట్విట్టర్ లో షేర్ చేసిన ఆల్విన్ ఫూ
తాజాగా ఈ బ్రిడ్జికి సంబంధించిన వీడియోను ఆల్విన్ ఫూ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ఈ అద్భుత వీడియోకు నెటిజన్ల నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలోని వాహనాలు నీళ్లలో మునిగిపోయిన ఫీలింగ్ కలుగుతోంది. వెహికిల్స్ అన్నీ ఈ బిడ్జికి ఒక వైపు నుంచి వెళ్తున్నాయి. ఆ బ్రిడ్జి మధ్యలో నీళ్లు కనిపిస్తున్నాయి. వాహనాలన్నీ బ్రిడ్జి మధ్యలోకి వచ్చి నీళ్లలోకి మునిగి మాయం అయినట్లు కనిపిస్తోంది. బిడ్జి మరోవైపు నుంచి వాహనాలు బయటకు వస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏంటే?
రివర్స్ బ్రిడ్జి మధ్యలో కొంత భాగాన్ని నీళ్ల కింది నుంచి నిర్మించారు. బ్రిడ్జి కింది బాగం నుంచి వాహనాలు పోయేలా రోడ్డు ఏర్పాటు చేశారు. పైనుంచి పడవలు, నౌకలు వెళ్లేలా రూపొందించారు. చూడ్డానికి ఆశ్చర్యం కలిగించే ఈ నిర్మాణం ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా నిలిచింది. ఆల్విన్ ఫూ పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు 9 మిలియన్లకు పైగా వ్యూస్ అసాధించింది. వేలాది షేర్లు, లక్షలాది కామెంట్స్ వచ్చాయి.
మీరూ ఈ అద్భుత వీడియోను చూడండి:
The 'reverse bridge' in Netherlands pic.twitter.com/8ulIRRMtix
— Alvin Foo (@alvinfoo) September 24, 2022
నెటిజన్స్ ఏంటున్నారంటే?
రివర్స్ బ్రిడ్జి వీడియో చూసి నెటిజన్స్ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. “తొలిసారి చూసి నేను అర్థం చేసుకోలేకపోయాను. ఇది చాలా అద్భుతమైన కట్టడం” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఈ బ్రిడ్జి అత్యంత సౌందర్యంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యాన్ని కలిగిస్తోంది” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
At first glance, I didn't comprehend. It looks amazing.
— HÜLYA MUTLU (@zucchiniflavour) September 24, 2022
Amazing engineering.
— Sandy EggO 🇺🇦 🌊🌊 🚫DM’s (@SandyEggO14) October 2, 2022
Read Also: ఇదేం వింత కోరిక బాబూ, తోడేలులా కనిపించడానికి అన్ని లక్షల ఖర్చా?