అన్వేషించండి

Viral News: ఇదేం వింత కోరిక బాబూ, తోడేలులా కనిపించడానికి అన్ని లక్షల ఖర్చా?

జపాన్ కు చెందిన ఓ వ్యక్తి తోడేలులా కనించేందుకు ఓ డ్రెస్ రెడీ చేయించుకున్నాడు. ఇందుకోసం ఏకంగా రూ. 18 లక్షలు ఖర్చు చేశాడు.

పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రపంచంలో  చాలా మందికి వింత వింత కోరికలుంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు బోలెడంత డబ్బు ఖర్చు చేస్తుంటారు. వాళ్లు చేసే పని ఇతరులకు ఆశ్చర్యం కలించినా, వారికి  మాత్రం చాలా సంతోషం కలిగిస్తాయి. తాజాగా జపాన్ కు చెందిన ఓ వ్యక్తి అచ్చం తోడేలుగా కనిపించేందుకు డ్రెస్ కుట్టించుకున్నాడు. ఇందుకోసం తను ఏకంగా రూ. 18 లక్షలు ఖర్చు చేశాడు.

తోడేలు డ్రెస్ కోసం రూ. 18.5 లక్షలు ఖర్చు

జపాన్ కు చెందిన జోకె జెప్పెట్ అనే సంస్థ జంతువుల్లా కనిపించే దుస్తులను తయారు చేయడంలో ప్రసిద్ధి పొందింది. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ సంస్ధ నుంచి దుస్తులు కుట్టించుకుంటారు. పోయిన ఏడాది ఓ వ్యక్తి అచ్చం కుక్కలా కనిపించే దుస్తులు తీసుకున్నాడు. ఇందుకోసం తను రూ. 12 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. తాజాగా మరో వ్యక్తి తోడేలులా కనిపించే దుస్తులు తయారు చేయించుకున్నాడు. ఇందుకోసం తను ఏకంగా 3,000,000 యెన్లు (భారత కరెన్సీలో రూ. 18.5 లక్షలు) వెచ్చించాడు.  

జంతువులపై ప్రేమతోనే తోడేలు డ్రెస్ తయారు చేయించుకున్నా!

“చిన్నప్పటి నుంచి నాకు జంతువులపై చాలా ప్రేమ ఉంది. టీవీలో కొన్ని అచ్చం జంతువుల్లా కనిపించే సూట్ లను చూశాను. అవి నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా అలా ఉండాలి అనుకున్నాను. ఇందుకోసం చాలా తోడేళ్ల ఫోటోలను పరిశీలించాను. చివరకు ఓ ఫోటో ఓకే చేశాను. జెప్పెట్ వారికి ఆ ఫోటో పంపించాను. తోడేలు వెనక కాళ్లపై నడిచేలా ఉండాలని చెప్పాను. వాళ్లు 50 రోజుల్లో తోడేళు దుస్తులను తయారు చేశారు. ఆ సూట్ రెడీ అయ్యాక నేను వేసుకున్నాను. అద్దంలో నా రూపం నేను చూసుకుని ఆశ్చర్యపోయాను. నేను ఊహించినట్లుగానే సూట్ ఉంది. నా కోరిక తీరింది” అని సదురు వ్యక్తి తెలిపాడు.       

కుక్క సూట్ కోసం రూ. 12 లక్షలు వెచ్చించిన కస్టమర్

గతంలో ఇదే సంస్థ నుంచి ఓ కస్టమర్ కుక్కలా కనిపించే సూట్ తయారు చేయించుకున్నాడు. ఈ దుస్తుల తయారీకి సుమారు రెండు నెలల సమయం పట్టింది. ఇందుకోసం సదరు వ్యక్తి రూ. 12 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ప్రత్యేక సందర్భాల్లో తాను ఈ కుక్క సూట్ ను వేసుకుంటానని చెప్పాడు.    

జంతువుల దుస్తులు తయారీలో జెప్పెట్ ప్రసిద్ధి

జపాన్ కు చెందిన జోకె జెప్పెట్ సంస్థ జంతువుల సూట్ లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందినది. ఇప్పటివరకు  వందల సంఖ్యలు జంతువుల దుస్తులను తయారు చేసింది. ఆయా దుస్తుల తయారీని బట్టి డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 10 లక్షల రూపాయలకు పైనే తయారీ ఖర్చు అయిన దుస్తులను పదుల సంఖ్యలో తయారు చేసినట్లు జెప్పెట్ వెల్లడించింది.

Read Also: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget