Viral Video: సెగలు కక్కే లావాలోకి మనిషి పడిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఈ వీడియో చూడండి
అగ్ని పర్వతాలు ఎప్పుడు బద్దలవుతాయో చెప్పడం కష్టం. ఒక్కసారి బద్దలయ్యిందా? దాని నుంచి వెలువడే లావా ముందు ఏ వస్తువైనా బూడిద కావాల్సిందే! ఒకవేళ అదే లావాలో మనిషి పడితే ఏమవుతుందో తెలుసా?
అగ్ని పర్వతాలు ప్రకృతిలో అత్యంత ఆసక్తికరమైనవే కాదు, అంతకుమించి భయంకరమైనవి. అగ్నిపర్వతాల పేలుడు కారణంగా కొన్ని దేశాలు నిత్యం ఎన్నో అవస్థలు పడుతున్నాయి. మరికొన్ని దేశాలు ఎప్పుడు అగ్ని పర్వతాలు పేలి ఇబ్బందులు పెడతాయోనని నిత్యం ఆందోళన చెందుతూనే ఉన్నాయి. అగ్ని పర్వతాలు పేలుడు కారణంగా సలసల కాగే లావా ఎంత దూరం ప్రయాణిస్తే అంతదూరం బూడిద కావాల్సిందే! కాసేపు అగ్ని పర్వతాలు ఎలా పేలుతాయి? ఎందుకు పేలుతాయి? అనే విషయాలను పక్కన పెడదాం. అగ్ని పర్వతం నుంచి బయటకు వచ్చే భయంకరమైన లావాలో మనిషి పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
సెగలు కక్కే లావాలో మనిషి పడిపోతే?
ముందుగా మీరు ఈ వీడియో చూడండి. పర్వతం మీద నుంచి లావాతో నిండిన లోయలోకి మనిషి పడితే ఏం జరుగుతుందో మీకే అర్థం అవుతుంది. వాస్తవానికి ఇది చాలా పాత వీడియో కానీ, మళ్లీ వైరల్ అవుతోంది.
Awakening a volcano by throwing a rock pic.twitter.com/Kplhv8dHTM
— Historic Vids (@historyinmemes) November 9, 2022
ఇథియోపియాలో పరిశోధన
ఈ ప్రయోగం ఇథియోపియాలోని పేరు పొందిన అగ్నిపర్వతం ఎర్టా అలెలో సమీపంలో జరిగింది. 30 కిలోగ్రాముల సేంద్రీయ వ్యర్థాలను(అచ్చం మానవ శరీర లక్షణాలను కలిగి ఉండే పదార్థాన్ని) లావాతో నిండి ఉన్న సరస్సులోకి పైనుంచి తోసేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందోనని పరిశోధకులు పరిశీలించారు. అగ్ని పర్వతం విస్పోటనం చెందిన సమయంలో వచ్చిన లావాలో మనిషి పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో గుర్తించారు. అక్కడ జరిగిన పరిశోధనకు సంబంధించి వీడియోను చిత్రీకరించారు. తొలుత సేంద్రీయ పదార్థం లావా సరస్సును తాకగానే, లావాపై ఏర్పడే గట్టిపడిన బూడిదకు సంబంధించిన మొదటి పొర విరిగిపోతోంది. ఆ తర్వాత సేంద్రీయ పదార్థం లావాలో మునిగిపోతుంది. లావా ఫౌంటెన్ నుంచి బుడగలు బుడగలుగా బయటకు రావడం గమనించవచ్చు.
ఫోటోవోల్కానికా యూట్యూబ్ ఛానెళ్లు తొలుత పబ్లిష్
ఈ వీడియోను మొదటిసారిగా యూట్యూబ్‌లో ఫోటోవోల్కానికా ద్వారా పోస్ట్ చేయబడింది. అగ్నిపర్వత సంబంధిత మెటీరియల్ కు సంబంధించిన ఆర్కైవ్ గా ఈ యూట్యూబ్ ఛానెల్ పని చేస్తోంది. ప్రయోగానికి సంబంధించి ఫోటోవోకానికా కొన్ని విషయాలు వెల్లడించింది. లావా సరస్సును సేంద్రీయ పదార్థం తాకగానే హింసాత్మక రీతిలో ప్రతిస్పందన ఏర్పడింది. అందులో కొంత భాగం సేంద్రీయ పదార్థం నుంచి ఆవిరి ఉత్పత్తి అయ్యిందని రాసుకొచ్చింది. తాజాగా ఇదే వీడియోను హిస్టారిక్ విడ్స్ (@historyinmemes) అనే ట్విట్టర్ పోస్టులో షేర్ చేయబడింది. ‘‘రాయిని విసిరి అగ్నిపర్వతాన్ని మేల్కొల్పడం’’ అనే క్యాప్షన్ పెట్టారు. దీనికి ఏకంగా 8.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Also: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు