అన్వేషించండి

Bruce Lee Death Mystery: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు

లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ మరణానికి సంబంధించి దశాబ్దాలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన ఎలా చనిపోయారు అనే అంశంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. తాజాగా తన మరణ రహస్యం వెల్లడైనట్లు తెలుస్తోంది.

బ్రూస్ లీ మరణం ఓ మిస్టరీ!

ప్రపంచంలోనే అతి గొప్ప మార్షల్ ఆర్టిస్టుల్లో బ్రూస్ లీ ఒకరు. ఆయన నటించిన అనేక సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్స్ గానే కొనసాగుతున్నాయి. లెజెండరీ మార్షల్ ఆర్టిస్టు అయిన బ్రూస్ లీ కేవలం 32 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు.  జూలై 20, 1973న అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంత వరకూ వాటికి పరిష్కారం లభించనేలేదు. ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.  

బ్రూస్ లీ మరణ రహస్యం తేల్చిన పరిశోధకులు

తాజాగా ఆయన మరణ రహస్యం తేలినట్లు క్లినికల్ కిడ్నీ జర్నల్‌ లో ప్రచురితం అయిన ఓ కొత్త పరిశోధనలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం లీ తన మూత్రపిండాలు అదనపు నీటిని విసర్జించలేకపోవడం వల్ల మెదడు వాపు వచ్చి చనిపోయారని తేల్చింది. లీ, సెరిబ్రల్ ఎడెమా లేదంటే మెదడు వాపుతో బాధపడ్డాడని అందులో ప్రచురించారు. ఆయన పోస్టుమార్టం రిపోర్టులో  మెదడు 1,575 గ్రాములు (3.5 పౌండ్లు) ఉబ్బినట్లు తేలింది. సాధారణంగా మానవుడి మెదడుతో పోల్చితే 1,400 గ్రాములు (3 పౌండ్లు) కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అంటే, ఈక్వేజెసిక్‌కు తీవ్ర ప్రతిచర్య కారణంగా సంభవించిన వాపుతో లీ మరణించినట్లు పరిశోధన నిర్ధారించింది.

 నీళ్లే చంపేశాయి!

Independent.co.uk నివేదిక ప్రకారం బ్రూస్ లీ హైపోనాట్రేమియా  సమస్య కారణంగా మరణించినట్టు తేల్చారు. అదనపు నీటిని విసర్జించడంలో ఆయన కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయకపోవడమే ఇందుకు కారణంగా వెల్లడించారు.  బ్రూస్ లీ మూత్రపిండాలు ఫెయిలవ్వడం వల్ల మరణించాడని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి లీ 'బి వాటర్ మై ఫ్రెండ్' అని అంటూ ఉండేవారు. కానీ, శరీరంలోని అదనపు నీరే అతనిని చంపినట్లు కనిపిస్తుందని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆయన చనిపోయే సమయంలో లీ ఎక్కువ నీటిని తీసుకుని ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

రోజుకు 10 నుండి 20 బాటిల్స్   

లీ డైట్‌ లో దాహాన్ని పెంచే రసాలు,  ప్రొటీన్ డ్రింక్స్ వంటి చాలా  ద్రవాలు ఉన్నాయని తాజా నివేదిక తెలింది.  IFLScience.com కూడా లీ తన జీవితంలోని చివరి నెలల్లో రోజుకు "పది నుండి ఇరవై సిరామిక్ బాటిల్స్ సేక్" తాగడం ప్రారంభించాడని అతని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు వెల్లడించింది.  సేక్ అనేది ఒక జపాన్ ద్రావకం. వాస్తవానికి ఆయన చనిపోవడానికి కొంత సేపటి ముందు గంజాయితో పాటు నీళ్లు తాగినట్లు తెలిపారు. రాత్రి 7:30 గంటల సమయంలో తలనొప్పి, తల తిరగడం లాంటి ఇబ్బందులకు గురయినట్లు చెప్పారు. ఆ తర్వాత తను ఈక్వేజిక్ అనే పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. ఆ పెయిన్ కిల్లర్ తీసుకున్న రెండు గంటల తర్వాత తను స్పందించ లేదని అప్పట్లో లీ సన్నిహితులు వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget