తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!
అతడి తొందరపాటు.. ఏదో చేసేద్దామనే అత్యాశ ఊహించని షాకిచ్చింది. అతడి అంగాన్ని జీవితాంతం స్తంభించేలా చేసింది. ఇంతకీ అతడు ఏం చేశాడు?
కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ యువకుడు.. తన భార్య దగ్గర మంచి మార్కులు కొట్టేదామని అనుకున్నాడు. పడక గదిలో రెచ్చిపోవాలని అనుకున్నాడు. స్నేహితుల సలహాతో నెలకు సరిపడా వయాగ్రాలు కొనుగోలు చేశాడు. పెళ్లి తర్వాత వాటిని ఒకొక్కటిగా వాడటం మొదలుపెట్టాడు. అయితే, మరింత సేపు ఆ పనిలో పాల్గోవడం కోసం అతడు నిర్దేశిత డోసు కంటే ఎక్కువగా వయాగ్రాను తీసుకోవడం మొదలుపెట్టాడు. దాన్ని అలవాటుగా చేసుకున్నాడు. అయితే, అతడు ఇప్పుడు ఊహించని చిక్కుల్లో పడ్డాడు. ఇక భవిష్యత్తులో వయాగ్రాతో పనిలేకుండా అతడి అంగం పర్మినెంట్‌గా స్తంభించింది. ఈ విషయంలో తాము కూడా ఏమీ చేయలేమని వైద్యులు కూడా చేతులెత్తేశారు.
ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ యువకుడికి కొద్ది నెలల కిందటే పెళ్లయ్యింది. అతడికి ఎలాంటి అంగస్తంభన సమస్యలు లేవు. కానీ, భవిష్యత్తులో పెద్దల వీడియోలు చూసి పాడైపోయాడో ఏమో.. వాటిలో ఉన్నట్లే తాను కూడా చేయగలనా అని స్నేహితుల వద్ద సందేహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో వారు వయాగ్రా వేసుకుంటే.. ఎంత సేపైనా చేయొచ్చని ఉచిత సలహా ఇచ్చారు.
ఫ్రెండ్స్ చెప్పినట్లే అతడు వయాగ్రాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. దానితో అవసరం లేకున్నా.. అత్యాశతో వాటిని మింగేవాడు. రోజులు గడిచే కొద్ది అతడి ఆశ రెట్టింపయ్యింది. నిర్దేశిత మొతాదు కంటే ఎక్కువ డోసులో వయాగ్రాను తీసుకోవడం మొదలుపెట్టాడు. ఓ రోజు ఎప్పటిలాగానే వయాగ్రా తీసుకున్నాడు. అప్పుడు గట్టిపడిన అంగం.. గంటలు గడిచినా సాధారణ స్థితికి రాలేదు. రోజులు గడుస్తున్నా ఏ మాత్రం మార్పు రాలేదు. చివరికి 20 రోజులైనా అతడి అంగం అలాగే స్తంభించి ఉండిపోయింది. ఆ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. దీంతో అతడి భార్య అతడిని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది.
చివరికి.. అతడు డాక్టర్‌ను ఆశ్రయించి జరిగింది చెప్పాడు. తన స్నేహితులు 200 గ్రాముల వయాగ్రా తీసుకోవాలని చెప్పారని, కానీ తాను దాని నాలుగింతలు ఎక్కువ తీసుకున్నానని తెలిపాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్.. బాధితుడు ప్రియాపిజం (priapism) అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మరోవైపు బాధితుడి కుటుంబికులు అతడి భార్య కుటుంబికులతో మాట్లాడి.. ఎలాగోలా ఆమెను ఇంటికి తిరిగి తీసుకొచ్చారు. అయితే, అతడు హాస్పిటల్‌లో చేరిన తర్వాత మళ్లీ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
Also Read: గుడ్ న్యూస్, ‘బరువు’ తగ్గిస్తున్న డయాబెటిక్ మందు, వ్యాయామం అక్కర్లేదట!
వైద్యులు అతడికి పెనీలే ప్రొస్థెసిస్ సర్జరీ నిర్వహించారు. అంగస్తంభన వల్ల అతడి ఆరోగ్యానికి హాని లేకుండా చేశారు. కానీ, అతడి అంగం మాత్రం జీవితాంతం స్తంభించే ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే, అతడికి ఎలాంటి సంతాన సమస్యలు ఉండవని, వయాగ్రా వల్ల అంగంలో నెలకొన్న అలజడి వల్ల అది అలాగే స్తంభించి ఉండిపోతుందని చెప్పారు. అతడు బిగువైన దుస్తులతో దాన్ని కప్పి పుచ్చడం తప్పా మరే మార్గం లేదన్నారు. చూశారుగా, ఏదైనా మాత్ర తీసుకొనేప్పుడు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడి సూచన లేకుండా ఎలాంటి మాత్రలు తీసుకోకూడదు. అలా చేస్తే ఎంత ప్రమాదమో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం.
Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు