Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని పాండాలున్నాయో అర నిమిషంలో చెప్పండి, కేవలం 10 శాతం మందే గుర్తించగలరు
ఆసక్తికరమైన ఆటల్లో ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి.
ఆప్టికల్ ఇల్యూషన్ కళ్లను మాయ చేసే అందమైన కళ. కంటిచూపుకు, మెదడుకు మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ఆప్టికల్ ఇల్యూషన్ ఇట్టే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రాలు కంటికి, మెదడుకు సవాలు విసిరేలా ఉంటాయి. ఇవి మంచి టైమ్‌పాస్‌లా ఉంటాయ. మెదడుకు మేతగా ఉంటాయి. వీటిలో కళ్ల ముందే అంతా స్పష్టంగా కనిపిస్తున్నా... కనిపించని దాన్ని మెదడు, కళ్ల సమన్వయంతో వెతకడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పని. దీని పుట్టుక వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఏళ్ల క్రితం నాడు ఇవే ప్రాచీన ప్రజలకు వినోదాన్ని పంచింది. ప్రశ్ననూ, జవాబునూ రెండింటినీ తనలోనే దాచుకోవడం ఈ బొమ్మల ప్రత్యేకత. మెదడును కాసేపు గజిబిజి చేసేస్తుంది.
పైన ఇచ్చిన చిత్రంలో పాండాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని పాండాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పాలి. ప్రపంచంలో కేవలం పది శాతం మంది మాత్రమే సరైన జవాబు చెప్పగలిగారు. మీ మెదడు కూడా చురుగ్గా పనిచేస్తే, తెలివి తేటలు ఉంటే... ఇట్టే సరైన లెక్కను తేల్చేస్తుంది. మెదడు, కళ్లను సమన్వయం చేసి లెక్కపెట్టండి. ఆకుల్లో, రాళ్లలో దాక్కున్న పాండాలను కూడా గుర్తించి లెక్కపెట్టి చెప్పండి. గంట సమయం ఇస్తే ఎవరైనా చెబుతారు. కేవలం 30 సెకన్లలో చెప్పాలి. లేదంటే నిమిషం సమయం తీసుకోండి. ఆ సమయంలోనే సరైన జవాబు చెబితే మీ మెదడుకు సలామ్ కొట్టాల్సిందే.
ఇదే జవాబు...
మీరు లెక్కపెట్టి అలిసిపోయారా? మీ జవాబును మొదట కామెంట్ గా పోస్టు చేయండి. ఆ తరువాత అసలు జవాబేంటో తెలుసుకోండి. ఇంతకీ చిత్రంలో ఎన్ని పాండాలు ఉన్నాయంటే.... పన్నెండు. అవెక్కుడున్నాయో చెప్పేందుకు వీలుగా కింద ఫోటో పోస్టు చేశాం. అందులో దాక్కున్న పాండాలను కూడా కనిపెట్టవచ్చు. పెద్ద పాండాలు ఎలాగూ కంటికి చిక్కుతాయి. కానీ చిన్న పాండాలను మాత్రం కాస్త కష్టపడి కనిపెట్టాలి.
మీకు సరైన జవాబే చెప్పుంటే మాత్రం మీరు చాలా ప్రత్యేకమమైన వ్యక్తి అనే చెప్పుకోవాలి. మీ కంటి చూపు, మెదడు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టే లెక్క. ప్రపంచంలోని తెలివైన పదిశాతం మందిలో మీరూ ఒక్కరని గర్వపడొచ్చు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఇంకా అనేకం ఉన్నాయి. వాటిని సాల్వ్ చేస్తూ మీ తెలివి తేటలను మరింత పెంచుకోండి.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లకు ప్రజాదరణ అధికం. ప్రపంచంలో ఇలాంటి చిత్రాలను గీసే ప్రత్యేక చిత్రకారుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలు గీయడం అంత సులభం కాదు. వీటిని ఎవరు మొదట సృష్టించారో కానీ అతనికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. వీటి సృష్టికర్త పేరు మాత్రం ఇంతవరకు తెలియలేదు. Also read: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం
Also read: యాంటీబయోటిక్ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమా?