Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం
ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు. వాటిలో అన్నింటికన్నా కష్టమైన ఉద్యోగం ఏదో ఎప్పుడైనా ఆలోచించారా?
![Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం This is the most dangerous job in the world and it is difficult for those who do this job to live past 50 years Dangerous Job: ప్రపంచంలో ప్రమాదకరమైన ఉద్యోగం ఇదే, ఈ పని చేసిన వారు 50 ఏళ్లు బతకడం చాలా కష్టం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/09/40f6ea19b28fb94e91e3873994d502451660031041045248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉద్యోగం చేసేది జీతం కోసమే. బతకడానికి ఒక్కొక్కరూ ఒక్కో పని చేస్తారు. అలాంటి ఉద్యోగాల్లో అతి ప్రమాదకరమైన ఉద్యోగం ఏదో తెలుసా? అతి ప్రమాదకరమైన ఉద్యోగం అనగానే లక్షల కొద్దీ జీతం ఇస్తారనే ఆలోచన కలుగుతుంది ఎవరికైనా. నిజానికి ప్రమాదకరమైనదే అయినా వచ్చే జీతం మాత్రం చాలా తక్కువ. అయినా ఏ పని దొరకని పేదవారు ఈ ఉద్యోగాలు చేస్తూ తన జీవనాన్ని గడుపుతున్నారు. ఈ ఉద్యోగం ఎంత ప్రమాదకరమైనదంటే ఈ పనిచేసే వారెవరూ 50 ఏళ్లు దాటి బతకడం చాలా కష్టం.
సల్ఫర్ మోసే ఉద్యోగం
నిపుణులు చెప్పిన ప్రకారం ప్రపంచంలో ప్రమాదకరమైనది అగ్నిపర్వతం నుంచి సల్ఫర్ ను సేకరించి బుట్టలో వేసుకుని తీసుకొచ్చే ఉద్యోగం. ఇండోనేషియాలోని అగ్నిపర్వతం లోపల సల్ఫర్ మైనింగ్ జరుగుతుంది. దాని లోపలికి రెండు బుట్టలు పట్టుకుని దిగుతారు. 90 కిలోల సల్ఫర్‌ను సేకరించి బుట్టల్లో నింపి బయటికి వస్తారు. సల్ఫర్ ఉన్న ప్రాంతంలోనే రోజు కొన్ని గంటల పాటూ ఉండడం వల్ల ఆ రసాయనానికి వారి శరీరం ప్రభావితం అవుతుంది. ఆ చుట్టు పక్కల గ్రామాల్లోని మైనర్లంతా ఇందులో పనిచేస్తారు. అందుకే వీరు ఎక్కువ కాలం జీవించరు. వీరిలో చాలా మంది 50 ఏళ్లలోపే మరణిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
జీతం ఎంతంటే...
ఇంత కష్టపడి పనిచేసే ఉద్యోగం అయినా వీరికి రోజుకు చెల్లించేది చాలా తక్కువ. రోజుకు 12 డాలర్లు అంటే రూ.954 చెల్లిస్తారన్నమాట. సల్ఫర్ తవ్వి సేకరించడం ఎంతో ప్రమాదకరమైనది. అయినా కూడా వారికి డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడరు. మైనర్‌గా ఉన్నప్పట్నించి గత ముప్పై ఏళ్లుగా ఇదే పనిచేస్తున్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ‘ప్రతిరోజూ కిలోల కొద్దీ సల్ఫర్ మోయడం వల్ల భుజాలు వాచిపోతున్నాయి. ఆ రసాయనం వల్ల శరీరానికి చాలా ప్రభావితం అవుతోంది. అయినా ఆకలికి భయపడి ఈ పని చేస్తున్నా. ఆకలివల్ల చనిపోతామేమోనన్న భయంతో ధైర్యం చేసి ఈ పని చేస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.
ఎంత ప్రమాదకరమో...
ఒక్కోసారి పొగలు బయటికి వస్తాయి, ఆ పొగలు శరీరంలో ప్రవేశిస్తే ఊపిరాడక బిగుతుగా అయిపోతుంది శరీరం. పేగులో నొప్పి ప్రారంభమవుతుంది. అలా పొగలు వచ్చినప్పుడు అందరూ బయటికి పరిగెడతారు. మళ్లీ తగ్గాక తిరిగి అగ్నిపర్వతంలోకి దిగుతారు.
రక్షణ ఎలా?
అగ్నిపర్వతంలోకి దిగేముందే నీటిలో ముంచిన వస్త్రాన్ని నోరు, ముక్కుకు మాస్క్‌లా ధరిస్తారు. ఆ వస్త్రం ఎండిపోయిన ప్రతిసారి దాన్ని తడుపుకుని ముక్కు, మూతికి కట్టుకుంటారు. ఎందుకంటే సల్ఫర్‌ను అధికంగా పీలిస్తే చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. నిజానికి ఆ మాస్క్ కూడా వారి ఆరోగ్యాన్ని కాపాడలేకపోతోంది. 50 ఏళ్లు రాకముందే చాలా మంది మరణిస్తున్నారు. ఆ ఉద్యోగం చేసేవారు 50 ఏళ్లు దాటి బతికారంటే చాలా వింతే అని చెప్పుకోవాలి.
Also read: యాంటీబయోటిక్ మందులు వాడుతున్నప్పుడు ఆల్కహాల్ తాగడం ప్రమాదకరమా?
Also read: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)