Vampire Facial: అందం కోసం ఫేషియల్ చేయించుకుంటే ఎయిడ్స్ వచ్చింది - కొంప ముంచిన కొత్త ట్రెండ్!
అందాన్ని కాపాడుకునేందుకు ఫేషియల్ చేయించుకున్న మహిళలకు HIV సోకిన ఘనట మెక్సికోలో జరిగింది. ఒకే స్పాలో ముగ్గురు మహిళలకు ప్రాణాంతక వైరస్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
Vampire Facials Infected Three Women With HIV: మహిళలు అందంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తరచుగా బ్యూటీ పార్లర్స్ కు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కొంత మంది మరింత అందంగా కనిపించాలని సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇంకొంత మంది వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలని కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా మెక్సికోలో అందం కోసం స్పాకు వెళ్లిన మహిళల జీవితాలే ప్రశ్నార్థకంగా మారాయి. ప్రాణాంతక HIV సోకి కంటతడి పెడుతున్నారు. స్పాకు వెళ్తే HIV సోకడం ఏంటని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే.
వాంపైర్ ఫేషియల్ తో HIV ఎటాక్
కొద్ది సంవత్సరాల క్రితం మెక్సికోలోని ఓ స్పాలో కొందరు మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. వాంపైర్ ఫేషియల్ అంటే, ఒకరకమైన కాస్మోటిక్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్. అంటే, ఫేషియల్ చేయించుకునే మహిళ చేతుల నుంచి రక్తాన్ని తీసి ముఖానికి ఇంజెక్ట్ చేస్తారు. దీన్ని ప్లేట్ లెట్ రిచ్ ప్లాస్మా మైక్రోనెడ్లింగ్ ప్రక్రియ అని కూడా పిలుస్తారు. ఇలా చేయడం వల్ల ముఖం మరింత అందంగా తయారవుతుంది. అలాగే కొంత మంది మహిళలు 2018లో న్యూమెక్సికోలోని ఓ స్పాలో ఈ ఫేషియల్ చేయించుకున్నారు. ఆ తర్వాత వారిని పరిశీలించగా, ముగ్గురు మహిళలకు HIV సోకినట్లు అధికారులు గుర్తించారు. వాంపైర్ ఫేషియల్ ద్వారానే HIV సోకినట్లు ఆరోపణలు వచ్చాయి. HIV సోకిన వ్యక్తి రక్తం మరొక వ్యక్తి బాడీలోకి వెల్లడం వల్లే ఈ వైరస్ సోకినట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.
ఒకే ఇంజెక్షన్ ద్వారా HIV సోకినట్లు గుర్తింపు
సాధారణ పరీక్షల్లో భాగంగా ఓ మహిళకు అధికారులు టెస్ట్ చేశారు. ఆమెకు HIV సోకినట్లు గుర్తించారు. కానీ, ఆమె ఎలాంటి ఇంజెక్షన్లు వాడిన దాఖలాలు లేవు. రక్త మార్పిడి కూడా చేయించుకోలేదు. HIV ఉన్నవారితో ఎలాంటి లైంగిక సంబంధాలను కలిగి లేదు. అయినా, ఆమె HIV ఎలా సోకింది? అనే విషయంపై అధికారులు ఆరా తీశారు. కానీ, ఆమె మెక్సికోలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నట్లు అధికారులకు వెల్లడించింది. ఆ ఫేషియల్ చేస్తున్నప్పుడు ఒకే సూదిని చాలా మందికి ఉపయోగించడం వల్ల ఈ వైరస్ సోకినట్లు నిర్దారణకు వచ్చారు.
వాంపైర్ ఫేషియల్ ఎలా చేస్తారు?
వాంపైర్ ఫేషియల్ చేయడానికి సుమారు గంట సమయం పడుతుంది. ముఖం మీద మచ్చలు, గాయాలు, గుర్తులను తొలగించుకునేందుకు ఈ ఫేషియల్ చేయించుకుంటారు. చేతి నుంచి తీసిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా అదే వ్యక్తి ముఖం మీద ఇంజెక్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల ముఖం మీద ప్లేట్ లెట్స్ కొత్త చర్మకణాలతో పాటు కొల్లజెన్ వృద్ధికి కారణం అవుతాయి. చర్మం మరింత అందంగా తయారవుతుంది.
స్పా సెంటర్ నిర్వాహకురాలికి మూడున్నరేళ్ల జైలు శిక్ష
HIV వైరస్ వ్యాప్తికి కారణం అయిన స్పా సెంటర్ ను అధికారులు మూసివేశారు. ఇందులో సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేకుండానే మెడికల్ ప్రాక్టీస్ చేసినందుకు గానూ స్పా నిర్వహకురాలికి మూడున్నరు ఏళ్లు జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
Read Also: కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు అమెరికా గజగజ - భారీగా పెరుగుతున్న FLiRT కేసులు, లక్షణాలేమిటీ?