Cancer: క్యాన్సర్, గుండె జబ్బులకు 2030 నాటికల్లా వ్యాక్సిన్లు, అలా జరిగితే స్వర్ణ యుగమే
అన్ని వ్యాధులకు వ్యాక్సిన్లు వస్తున్నాయి. కానీ ప్రాణాంతక క్యాన్సర్, గుండె జబ్బులకు ఇంతవరకు ఎలాంటి వ్యాక్సిన్లు లేవు.
ఎన్నో రకాల వ్యాధులు, జబ్బులు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. వాటికి రకరకాల వ్యాక్సిన్లను కనిపెడుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ప్రాణాంతక రోగాలైన క్యాన్సర్, గుండె జబ్బులు, కొన్ని ఆటోఇమ్యూన్ వ్యాధులకు మాత్రం ఇంతవరకు ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. ఇప్పుడు వాటికి వ్యాక్సిన్లను తయారు చేసే పనిలో పడింది. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ఏటా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వారిని కాపాడాలన్న ఉద్దేశంతోనే శాస్త్రవేత్తలు ఆ జబ్బులకు వ్యాక్సిన్లను కనిపెట్టే పనిలో పడ్డారు. ప్రపంచంలోని ప్రముఖ వైద్యుల్లో ఒకరు మిస్టర్ బర్టన్. ఆయన మాట్లాడుతూ 2030 నాటికల్లా క్యాన్సర్, గుండె జబ్బులకు వ్యాక్సిన్లు కనిపెట్టే పని మొదలైందని చెప్పారు. ఇది కాస్త కష్టమైన పనే, అయినా అసాధ్యమైతే కాదని వివరించారు.
2020లో కోవిడ్ మహమ్మారి రెచ్చిపోతున్న కాలంలో కొన్ని నెలల కాలంలోనే దాన్ని అరికట్టే వ్యాక్సిన్లను తయారు చేశామని, అలాగే మానవాళిని అకాల మరణం నుంచి తప్పించేందుకు ప్రాణాంతక జబ్బులకు వ్యాక్సిన్లు కనిపెట్టే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. తమ అంచనా ప్రకారం 2030 నాటికి కొన్ని రకాల క్యాన్సర్లకు, గుండె జబ్బులకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండొచ్చని వివరించారు.
ఇప్పటికే గర్భాశయ ముఖ క్యాన్సర్ టీకా అందుబాటులో ఉంది. ఇది ప్రపంచంలో ఎక్కువ మందికి వస్తున్న క్యాన్సర్లలో ఒకటి. మహిళలు ఈ క్యాన్సర్ బారిన త్వరగా పడుతున్నారు. మనదేశంలో ఏటా లక్షా 20 వేల మంది మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 67,000 మంది మహిళలు మరణిస్తున్నారు. 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉన్న మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
సాధారణంగా 60 ఏళ్ల వయసు పైబడిన వారికి క్యాన్సర్ వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి దాడి చేస్తుంది. 15 ఏళ్ల నుంచి 39 ఏళ్ల లోపు వయసు ఉన్న వారికి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం పెరిగింది. అవి బ్రెయిన్ ట్యూమర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కార్సినోమా, జననేంద్రియాల్లో క్యాన్సర్, లింఫోమమా, థైరాయిడ్ క్యాన్సర్ వంటివి. ఇవి వయసుతో సంబంధం లేకుండా వచ్చి పడుతున్నాయి.
మహిళల్లో థైరాయిడ్, గర్భాశయ, అండాశయ, రొమ్ము క్యాన్సర్లు అధికంగా వస్తాయి. ఇక పురుషుల్లో లుకేమియా, థైరాయిడ్, టెస్టిక్యులర్, లింఫోమా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. క్యాన్సర్లో ప్రమాదకరమైనవి బ్రెయిన్ ట్యూమర్, కార్సినోమా. కార్సినోమా అంటే జీర్ణ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్.
Also read: ఒరియో బిస్కెట్లతో ఇలా ఐస్ క్రీము చేసి చూడండి, అదిరిపోతుంది
Also read: శిశువు ఏ లోపాలు లేకుండా పుట్టాలంటే గర్భిణీలు కాకరకాయ వంటకాలు తినాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.