By: Haritha | Updated at : 17 Apr 2023 08:03 AM (IST)
(Image credit: Pixabay)
గర్భం ధరించాక మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే పుట్టే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. చాలామంది మహిళలు జంక్, ప్రాసెస్డ్ ఫుడ్, అధిక కేలరీలు ఉండే ఫుడ్ ను తినడానికి ఇష్టపడతారు. ఇది తల్లీ, బిడ్డ ఇద్దరి దీర్ఘకాలిక ఆరోగ్యానికి హానికరమైనవి. అందుకే వైద్యులు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తినాలని, ఇది గర్భస్థ శిశువులపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతారు. గర్భిణీలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో కాకరకాయ కూడా ఒకటి. ఇది పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది.
పిండానికి ఎలా మంచిది?
కాకరకాయలు పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి తల్లిపైనే కాదు గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. ఒక పరిశోధనలో ఎలుకలపై ఈ కాకరకాయలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో పరిశోధన చేశారు. ఇందులోని ఇథనాల్ గర్భధారణ సమయంలో తినడం పూర్తిగా సురక్షితం అని తేలింది. గర్భం పై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిసింది. కాకరకాయ తినడం వల్ల గర్భం ధరించిన మహిళల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటున్నట్టు గుర్తించారు.
భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాలలో ఫొలేట్ లోపం కనిపిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఖనిజం. ఇది లోపిస్తే గర్భస్థ శిశువులో న్యూరల్ ట్యూబ్ లోపాలు వచ్చే అవకాశం ఉంది. కాకరకాయలో ఫొలేట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శిశువుకు ఎలాంటి నరాల వ్యవస్థ లోపాలు రాకుండా ఉంటాయి.
కాకరకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే చేదు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీ స్త్రీల ప్రేగు కదలికలను సులభతరం చేసి, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసేలా చేస్తుంది.
మితంగా తినాలి...
వైద్యులు చెబుతున్న ప్రకారం గర్భిణీ స్త్రీలు ఎన్నుకునే ఆహారం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. ఏ ఆహారాన్ని అవసరానికి మించి తినకూడదు. అలాగే కాకరకాయ కూడా మితంగానే తినాలి. వారానికి రెండుసార్లు కాకరకాయ తింటే చాలు. అంతకుమించి తినకపోవడమే మంచిది. వీటిలో ఉండే గ్లైకోసైడ్లు వంటివి శరీరంలో అధికంగా చేరితే అవయవాలను విషపూరితం చేస్తాయి. వికారం, వాంతులు వంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారానికి రెండుసార్లు కాకరకాయను తింటే చాలు. రెండు సార్లు తినడం వల్ల మాత్రం అంతా మంచే జరుగుతుంది. సాధారణంగా కూడా కాకరకాయ తినడం ఆరోగ్యానికి మంచిదే.
Also read: ప్రపంచంలోనే అరుదైనవి నల్లని పుచ్చకాయలు, వీటిని పెళ్లికి గిఫ్టులుగా ఇస్తారు
Also read: ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీ మెదడు మొదట ఏ బొమ్మను గుర్తించింది?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Sleeping Disorder: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే
ఈ జీవులతో జాగ్రత్త - కరవడమే కాదు, చర్మంలో గుడ్లు కూడా పెట్టేస్తాయ్!
Dreams Meaning: మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా? త్వరలో మీకు పెళ్లికాబోతుందని అర్థం!
Diabetes: డయాబెటిస్ బాధితులకు వేసవి చాలా డేంజర్ - ఇలా అదుపులో ఉంచుకోండి
ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !