By: Haritha | Updated at : 16 Apr 2023 08:35 AM (IST)
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్... మెదడుకు పదును పెట్టే పజిల్. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఇవి సరిగ్గా అంచనా వేస్తాయని అంటారు పరిశోధకులు. సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్లు తెగ వైరల్ అవుతున్నాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఈ బొమ్మను చూడగానే మీ మెదడు మొదట దేనిని గుర్తించిందో చెప్పండి. మీరు ఎలాంటి వారు చెప్పొచ్చు. ఈ బొమ్మలో రెండు రకాల చిత్రాలు ఉన్నాయి. ఒకటి పుర్రె, రెండోది ఇద్దరమ్మాయిలు కార్డులు ఆడుతూ ఉంటారు. ఈ రెండింట్లో మొదట మీ మెదడు దేనిని గ్రహించిందో అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది.
మొదట ఏం చూశారు?
మీరు మొదట పుర్రెను చూశారా? అయితే మీరు చాలా నిజాయితీ గల వ్యక్తి అని అర్థం. మిమ్మల్ని ఎవరైనా విశ్వసించవచ్చు. మీ స్నేహితులు మీతో ఏ రహస్యాన్ని అయినా పంచుకోవచ్చు. దాన్ని మీరు ఇతరులకు చెప్పకుండా జాగ్రత్తగా కాపాడుతారు. మీరు ఇతరులతో అనవసర పోటీలకు దిగరు. జీవితాంతం నిజాయితీగా ఉండడానికే ఇష్టపడతారు.
అలాకాకుండా మీరు ఇద్దరు అమ్మాయిలు కార్డులు ఆడటం అనేది గుర్తించి ఉంటే... మీ స్వభావంలో పోటీ తత్వం ఎక్కువ అని అర్థం. అలాగే ఓటమిని అంత త్వరగా అంగీకరించరు. అంతేకాదు మీరు ఉల్లాసంగా ఉండడానికి ఇష్టపడతారు. జీవితంపై ఆశలు ఎక్కువ.
ఆప్టికల్ ఇల్యూషన్ కళ్లను మాయ చేసే అందమైన కళ. కంటిచూపుకు, మెదడుకు మధ్య ఉన్న బంధం ఎంత బలంగా ఉందో ఆప్టికల్ ఇల్యూషన్ ఇట్టే చెప్పేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ చిత్రాలు కంటికి, మెదడుకు సవాలు విసిరేలా ఉంటాయి. ఇవి మంచి టైమ్‌పాస్‌లా ఉంటాయ. మెదడుకు మేతగా ఉంటాయి. వీటిలో కళ్ల ముందే అంతా స్పష్టంగా కనిపిస్తున్నా... కనిపించని దాన్ని మెదడు, కళ్ల సమన్వయంతో వెతకడమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పని. దీని పుట్టుక వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. వందల ఏళ్ల క్రితం నాడు ఇవే ప్రాచీన ప్రజలకు వినోదాన్ని పంచింది. ప్రశ్ననూ, జవాబునూ రెండింటినీ తనలోనే దాచుకోవడం ఈ బొమ్మల ప్రత్యేకత. మెదడును కాసేపు గజిబిజి చేసేస్తుంది.
ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లకు ప్రజాదరణ అధికం. ప్రపంచంలో ఇలాంటి చిత్రాలను గీసే ప్రత్యేక చిత్రకారుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలు గీయడం అంత సులభం కాదు. వీటిని ఎవరు మొదట సృష్టించారో కానీ అతనికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. వీటి సృష్టికర్త పేరు మాత్రం ఇంతవరకు తెలియలేదు.
Also read: డయాబెటిస్ ఉందా? అయితే పచ్చి మామిడిని తినడం ప్రారంభించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Sleeping Together: జీవిత భాగస్వామితో కలిసి నిద్రపోతే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
Chinese Woman: షాపింగ్ చేయడానికి తోడు కావాలా? అయితే ఈ అమ్మాయి కంపెనీ ఇస్తుంది - కానీ కండీషన్స్ అప్లై
White Rice: వైట్ రైస్ ఆరోగ్యకరం కాదా? ఈ విషయాలు తెలిస్తే ధైర్యంగా భోజనం చేస్తారు!
Stomach Pain: వాతావరణం మారినప్పుడల్లా మీకు కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట
Glioblastoma: భయపెడుతోన్న 'గ్లియోబ్లాస్టోమా'- 6 నెలల్లోనే చంపేసే మెదడు వ్యాధి, ఈ లక్షణాలుంటే జాగ్రత్త
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!